కోడి వ్యర్ధాలను సప్లై చేస్తున్న బొలెరో వాహనం పట్టివేత..
1 min read– ప్రజల ప్రాణాలకు హాని కలిగించే వ్యర్ధాలను తరలించవద్దు..
– పెదపాడు ఎస్ ఐ చల్లా కృష్ణ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు పెదపాడు మండలంలో కోడి వ్యర్ధాలను తరలిస్తున్నన వాహనములను ఎప్పటికప్పుడు పట్టుకొని ప్రజల ప్రాణాలకు ఏ హాని కలగకుండా మరియు గతంలో ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఇచ్చిన ఆదేశానుసారం కోడి వ్యర్ధాలను పెదపాడు మండలంలో ఎక్కడ కూడా చేపల చెరువులకు సప్లై చేయకుండా కట్టడి చేస్తున్నట్లు పెదపాడు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చల్లా కృష్ణ తెలిపారు. అలాగే ఏలూరు జిల్లా ఎస్పీ గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుకూలంగా పెదపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదో ఒకచోట కోడి వ్యర్ధాలను తరలిస్తున్న వాహనం ఉన్న పట్టుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుందనీ గతంలో ఎన్నడూ లేని విధంగా కోడి వ్యర్ధాలను తరలిస్తున్న యజమానులు వాహన డ్రైవర్లపై కేసును నమోదు చేస్తున్న పెదపాడు పోలీసు హెచ్చరిస్తున్నారు. శుక్రవారం ఉదయం కోడి వ్యర్ధాలను తరలిస్తున్న బులోరా వాహనమును పెదపాడు మండలం గోగుంట గ్రామ శివారు వద్ద పట్టుకొని మూడు టన్నుల కోడి వ్యర్ధాలను సీజ్ చేసి సదర వాహన యజమాని మరియు చేపల చెరువు యజమాని సాగరం వాహన డ్రైవర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని మరియు కోడి వ్యర్ధాలను ధ్వంసం చేయడం జరుగుతుందని ఎస్సై చల్లా కృష్ణ ప్రకటనలో తెలిపారు.