ఆర్యవైశ్య మహాసభ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లాలి..
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: దేశంలోనే ఏ సంస్థకు లేనివిధంగా 100 సంవత్సరాలు చరిత్ర ఉన్న ఆర్యవైశ్య మహాసభ కార్యక్రమాలను రాజకీయ పార్టీలకు అతీతంగా ముందుకు తీసుకువెళ్లాలని ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్, మాజీ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సూచించారు .కర్నూలు నగరంలోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గానికి ఆయన నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆర్యవైశ్య ,మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఆర్యవైశ్య మహాసభకు వంద సంవత్సరాల చరిత్ర ఉందని వివరించారు. ఈ మహాసభకు దివంగత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అధ్యక్షుడిగా ఉండి సంస్థ గౌరవాన్ని మరింత పెంచే విధంగా ముందుకు తీసుకు వెళ్లారని చెప్పారు .ఆర్యవైశ్య మహాసభ సేవా దృక్పథంతో తన కార్యక్రమాలను నిర్వహిస్తుందని, ఇందులో భాగంగానే సంస్థకు సంబంధించిన వసతి గృహాల్లో ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు కూడా అవకాశం కల్పించిందని వివరించారు. అన్ని కులాలతో మమేకమై ఆర్యవైశ్య మహాసభ అందరూ కలిసిపోయే విధంగా పనిచేస్తుందని చెప్పారు. ఇలాంటి సంస్థకు గత నాలుగు సంవత్సరాలుగా ఎన్నికలు జరగలేదని, ఒక వ్యక్తి నామినేటెడ్ గా నామినేటెడ్ ప్రెసిడెంట్ గా ఉంటూ కార్యక్రమాలు చేశారని చెప్పారు .ఈ క్రమంలో ఆర్యవైశ్య మహాసభకు రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని తాను సూచించానని వివరించారు. ఆర్యవైశ్య మహాసభ కు సంబంధించి కార్యవర్గాన్ని ఎన్నుకునే ఎన్నికలను మాజీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉంటుందని, ఇదే క్రమంలో రాజ్యాంగ బద్దంగా ఎన్నికలు నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని చెప్పారు. ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో అన్ని జిల్లాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ కల్పించామని చెప్పారు. ఆర్యవైశ్య మహాసభ కార్యక్రమాలను రాజకీయ పార్టీలకు అతీతంగా నిర్వహించాలని, ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో అన్ని పార్టీలకు చెందిన వారు ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆర్యవైశ్య మహాసభకు వచ్చినప్పుడు ఆర్యవైశ్య సామాజిక వర్గ అభివృద్ధి కోసమే పాటుపడాలని అందులో రాజకీయ పార్టీలకు అతీతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. అనంతరం ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ ఆర్యవైశ్య మహాసభ గౌరవాన్ని పెంచే విధంగా కార్యక్రమాలను రూపొందించి ముందుకు తీసుకు వెళ్తామని చెప్పారు. తమ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు చిన్న రామ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి షణ్ముఖరావు, కోశాధికారి శీను, ఉపాధ్యక్షులు విట్టా రమేష్, చీమకుర్తి బద్రీనాథ్, ఈ సి మెంబర్ల సుబ్బారావు.