సమయం లేదు మిత్రమా.. జగనన్న సురక్ష పథకానికి తూట్లు..
1 min read– పర్యవేక్షణ కొరవడిన నిర్లక్ష్యానికి ప్రజల అవస్థలు..
పల్లెవెలుగు వెబ్ గడివేముల: ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేసిన అధికారుల నిర్లక్ష్యం పథకానికి తూట్లు పొడుస్తుంది. వివరాలలోకి వెళ్తే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది గడివేముల మండల పరిధిలోని బిలకల గూడూరు గ్రామంలోని ఉర్దూ స్కూల్ వద్ద ఏర్పాటుచేసిన జగనన్న సురక్ష కార్యక్రమంలో వివిధ రోగాలకు వైద్యం చేయించుకోవడానికి వచ్చిన గ్రామస్తులకు ఓపిలు పంపిణీ చేశారు అయితే ఉదయం తొమ్మిది గంటల నుంచి 4:45 వరకు ప్రజలకు వైద్యం అందిన ఆ తర్వాత సమయం లేదంటూ వచ్చిన గ్రామస్తులకు వెనక్కు పంపించారు జిల్లా కేంద్రాలలో ఉన్న ఉద్యోగులు ఇళ్లకు వెళ్లడానికి సమయం లేదంటూ హడావుడిగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ముగించారు దీంతో వైద్యం అందక గ్రామస్తులు వెను తిరిగారు గ్రామాలలో వ్యవసాయ పనులు వెళ్లిన కూలీలు సాయంత్రం ఐదు కు వచ్చిన వైద్యం అందలేదని పనులకు వెళ్లకుండా వైద్యం చేయించుకోవాలంటే కష్టమని ఇంత దానికి శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఎందుకని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు . ప్రభుత్వ సంక్షేమాలు సమయానికే అందుతాయని రాకపోతే అంతేనా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు అధికారుల నిర్లక్ష్యంపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.