ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ శాఖ గ్రంథాలయంలో శనివారం వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయ అధికారి రామ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాలకు స్థానిక మండ్రోపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాసిం సాహెబ్ హాజరై వాల్మీకి చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన గావించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, వాల్మీకి మహర్షి సంస్కృత ఆదికవి అని అన్నారు. రామాయణ మహాకావ్యాన్ని రచించి ప్రపంచానికి చాటి చెప్పిన జ్ఞాన నిధి వాల్మీకి మహర్షి అని, వాల్మీకి గొప్ప ఖగోళ వేత్త అని చాలామందికి తెలియదని తెలిపారు. అశ్విని మాసంలో పూర్ణిమ రోజున వాల్మీకి జయంతిని జరుపుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ పాటకులు కార్తీ సురేంద్ర, శ్రీనివాసులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.