(నా భూమి నా దేశం) దేశానికే గర్వకారణం
1 min read-NYKS జిల్లా కోఆర్డినేటర్ రాహుల్ రెడ్డి స్పస్తీకరణ
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: మేరీ మాటి, మేరీ దేశ్ అన్న నినాదం దేశానికే గర్వకారణం అని ఎన్. వై. కే. ఎస్. జిల్లా కోఆర్డినేటర్ రాహుల్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం స్థానిక పత్తికొండ “సమీకృత సంక్షేమ బాలుర వసతి గృహ సముదాయంలో”( ఇంటిగ్రేటెడ్ హాస్టల్,) మేరీ మాటి మేరీ దేశ్ కార్యక్రమాన్ని NYKS, కర్నూలు వారి సహకారంతో యువ స్పందన సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా నా భూమి నా దేశం అని అందరూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర జిల్లా కోఆర్డినేటర్ రాహుల్ రెడ్డి, తెలుగు ఉపాధ్యాయుడు రాజా జయ చంద్ర మాట్లాడుతూ,ఈ దేశం ఎంతోమంది మహనీయులకి పుట్టినిల్లని, ఎంతోమంది ప్రాణ త్యాగాలతోనే స్వాతంత్రం సిద్ధించిందని వారి త్యాగ ఫలితంతో స్వేచ్ఛగాజీవించగలుగు తున్నామని అన్నారు. అలాగే మనం పుట్టిన నేలకు ఉన్న దేశానికి మన వంతు బాధ్యతగా విద్యార్థి దశ నుండే అన్ని రంగాలలో ప్రావీణ్యం పొందుతూ, దేశ అభ్యున్నతికి పాటుపడాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా పలు ప్రాంతాలలో సేకరించిన మట్టిని కలశం లోకి ముఖ్య అతిధులు మరియు విద్యార్థులు వేసి వీరులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ స్పందన అధ్యక్షుడు సురేంద్ర, ఉపాధ్యక్షుడు లక్ష్మన్న, హాస్టల్ వార్డెన్ నాగరాజు, వనం జయదేవ్, శివ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.