పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో రక్తదానం
1 min read– పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన నంద్యాల జిల్లా పోలీసులు….
ఇండియన్ రెడ్ క్రాస్,విజయ బ్లడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో జిల్లా పోలీసు కార్యాలయంలో రక్త దాన శిబిరం ఏర్పాటు,220 మందికి పైగా రక్తదానం ……
– రక్త దానం చెయ్యండి, చేపించండి ప్రాణాపాయ స్థితిలో వున్నవారికి ప్రాణం కాపాడండి…..
– రక్తదానం చేసిన వారిని అభినందించి సర్టిఫికెట్ లు అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ K.రఘువీర్ రెడ్డి IPS గారు
పల్లెవెలుగు వెబ్ నంద్యాల : పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ఎస్పీ గారి సూచన మేరకు అక్టోబర్ 28న శనివారం నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “ఇండియన్ రెడ్ క్రాస్ నంద్యాల వారి సౌజన్యంతో “, రక్తదాన శిభిరం ఏర్పాటు చేసారు.రక్త దానం చెయ్యండి, చేపించండి ప్రాణాపాయ స్థితిలో వున్నవారికి ప్రాణం కాపాడండి అని నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ K.రఘువీర్ రెడ్డి IPS గారు పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ లలో, ఏఆర్ విభాగంలో విధులు నిర్వహించే పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది, జిల్లాలోని పౌరులు, విధ్యార్థులు ,ఇతర ప్రజలు మొత్తం 220 మందికి పైగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారిని జిల్లా ఎస్పీస్వయంగా అభినందించి పళ్ళు, ఫ్రూట్ జ్యూస్ ను అందజేసినారు, వారు చేసిన సమాజసేవకు గుర్తుగా వారికి సర్టిఫికెట్ లు అందజేసినారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటు అక్టోబర్ 31 వ తేది వరకు జిల్లాలో నిర్వహించే “పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో” భాగంగా నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయం నందు ఆధ్వర్యంలో “ఇండియన్ రెడ్ క్రాస్ నంద్యాల వారి సౌజన్యంతో “పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు. వీరు గవర్నమెంట్ హాస్పిటల్ వారికి 30%, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి ఉచితంగా రక్తం అందిస్తుంటారన్నారు. తల సేమియా వ్యాధి గ్రస్తులకు శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచడానికి ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒకసారి తప్పనిసరిగా రక్తం ఎక్కిస్తూ ఉండాలన్నారు. తలసేమియాతో బాదపడుచున్న 80 మంది వీరి వద్ద రిజిస్టర్ కాబడి ఉన్నారని వారికి ప్రతి నెలకు 160 బ్లడ్ బ్యాగ్స్ ఇవ్వవలసి ఉంటుదన్నారు. మన దేశంలో రక్తపు నిల్వల కొరత ఉందని, మనం దానం చేసే ప్రతి ఒక్క “రక్తపు బిందువు” మరొకరికి ప్రాణం పొసే “అమృత బింధువు” అవుతుందన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది, ఇతరులు పాల్గొన్నారన్నారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ లు అందించడం జరిగిందన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తం కొరత ఏర్పడకుండా రక్తదానం చేయుటకు మనం ముందుండాలని, రక్త దానం చెయ్యండి, చేపించండి ప్రాణాపాయ స్థితిలో వున్నవారికి ప్రాణం పొయ్యండని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. రక్తదానం విషయంలో అపోహలు పడవద్దని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చెయ్యటం మంచిదన్నారు.
రక్త దానం వలన కల్గే ప్రయోజనాలు
1)రక్తదానం చేసిన ప్రతిసారి ముగ్గురు బాదితుల ప్రాణాలు కాపాడినట్లే
2)తరచూ రక్తం ఇవ్వడం వలన కేన్సర్ ముప్పు తప్పుతుంది.
3)సంవత్సరంలో ఒక్కసారైనా రక్తం ఇస్తే గుండె పూటు ముప్పు 88% తగ్గువచ్చు .
4)రక్తంలో ఉండే ఆదికశాతం ఇనుము వల్ల రక్తనాళాలు పూడిపోయు గుండె పూటు ముప్పు వస్తుంది.దానంతో ఇనుము నిల్వలు తగ్గుతాయి .తద్వారా కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.
5)రక్తదానం చేయడంవల్ల ఎముకల మజ్జ కొత్త ఎర్ర రక్తకనాల ఉత్పత్తి చేస్తుంది .ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ G.వెంకట రాముడు ,AR అడిషనల్ ఎస్పీ G.చంద్రబాబు , AR డిఎస్‌పి రంగముని ,నంద్యాల సబ్ డివిజన్ CI లుమరియు SI లు, ఆర్మూడ్ రిజర్వ్ RI లు,మరియు RSI లు,ఇండియన్ రెడ్ క్రాస్ నంద్యాల చైర్మన్ దస్తగిరి , వైస్ చైర్మన్ మారుతి కుమార్ , జిల్లా కమిటి సభ్యులు ఉస్మాన్ బాషా ,HDFC బ్యాంక్ వారు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పై రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయడంలో కృషి చేసిన వారందరినీ జిల్లా ఎస్పీ అభినందించారు.