PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రక్తదానం  ఒక జీవితాన్ని కాపాడుతుంది

1 min read

పట్టణ పోలీస్ స్టేషన్ లో  మెగా రక్తదాన శిబిరం

రక్తదాన శిబిరానికి విశేష స్పందన

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రక్తదానం చేయడం వలన ఒక జీవితాన్ని కాపాడుతుందని ఆత్మకూరు డిఎస్పీ ఏ.శ్రీనివాసరావు అన్నారు. పోలీసుఅమరవీరుల సంస్కరణ వారోత్సవాలలో భాగంగా నంద్యాల జిల్లా ఎస్పీ కే.రఘువీర్ రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆత్మకూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఏ. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నందికొట్కూరు టౌన్ సిఐ ప్రకాష్ కుమార్,నందికొట్కూరు రూరల్ సిఐ విజయభాస్కర్ పర్యవేక్షణలో శనివారం ఉదయం పట్టణ పోలీస్ స్టేషన్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమైనది.ఈ రక్తదాన శిబిరంలో రెడ్ క్రాస్ సంస్థ నంద్యాల వైద్యులు  మరియు నందికొట్కూరు రోటరీ క్లబ్ వారి సౌజన్యంతో,స్పెషాలిస్టు డాక్టర్ ల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ శిబిరంలో 100 మంది రక్తదానం చేశారు.రక్తదానం చేసిన వారి లో నందికొట్కూరు టౌన్,రూరల్ సి‌ఐ లు ప్రకాష్ కుమార్,విజయభాస్కర్,మిడుతూరు ఎస్ఐ జగన్మోహన్,పోలీస్ సిబ్బంది మరియు నందికొట్కూరు సర్కిల్ లోని  పోలీస్ స్టేషన్లో పరిధిలో పనిచేస్తున్నటు వంటి సిబ్బంది మరియు ప్రజలు,విధ్యార్థులు, ఓల్డ్ బిఎస్ఆర్ టీమ్ లడ్డు ఆధ్వర్యంలో యువకులు రక్తదానం చేయడమైనది.ఈ సందర్భంగా ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ రక్తదానం చేసి మరొకరి ప్రాణం కాపాడటం అనేది గొప్ప కార్యం అని,రక్తదానం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని రక్తదానం చేసిన ప్రతిసారి ముగ్గురు బాదితుల ప్రాణాలు కాపాడినట్లే నని అన్నారు.రక్తదానం చేయడంవల్ల ఎముకల మజ్జ,కొత్త ఎర్ర రక్త కణాల ఉత్పత్తి చేస్తుందని తెలియజేశారు.

రక్తదానం చేసిన వారికందరికి  ఆత్మకూరు డిఎస్పి శ్రీనివాసరావు చేతుల మీదుగా సర్టిఫికెట్లు,పండ్లు,జూస్ మొదలగునవి అందజేశారు.ఈ కార్యక్రమం విజయవంతం చెయ్యడంలో పాల్గొన్న రెడ్ క్రాస్ వారికి,రోటరీ క్లబ్ వారికి ఆర్.ఎం.పి,పి.ఎం.పి డాక్టర్ ల బృందానికి పోలీసు అదికారులకు, సిబ్బందికి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ ఎన్.వి రమణ,వెంకటసుబ్బయ్య  జూపాడుబంగ్లా ఎస్ఐ మారుతి శంకర్, ముచ్చుమరి ఎస్ఐ నాగార్జున,బ్రహ్మణకొట్కూరు ఎస్ఐ ఓబులేసు,మిడుతూరు ఎస్ఐ జగన్మోహన్ మరియు పట్టణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author