ఫుడ్ ఫెస్టివల్ ను సద్వినియోగం చేసుకోండి..
1 min read– జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: అధిక ప్రోటీన్, మినరల్స్, విటమిన్స్ ఇచ్చే రొయ్యలు & చేపల ఫుడ్ ఫెస్టివల్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ తెలిపారు. కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్ లో రొయ్యలు & చేపల ఫుడ్ ఫెస్టివల్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధిక పోషిక విలువల నిచ్చే రొయ్యలు & చేపల ఫుడ్ ఫెస్టివల్ ను ఆహార ప్రియులు ఉపయోగించుకోవాలని కోరారు. నవంబర్ 3, 4, 5వ తేదీల్లో కర్నూలు నగరంలోని రావూరి గార్డెన్స్ లో రొయ్యలు & చేపల ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తుండగా, ఈ ఉత్సవాన్ని మత్స్య శాఖ, భూమి ఆర్గానిక్‌లతో నిర్వహిస్తోందని, ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలన్నారు. రొయ్యల ఫుడ్ ఫెస్టివల్ లో వినియోగదారులు, పారిశ్రామికవేత్తలు విరిగిగా పాల్గొని ఫిష్ ఆంధ్రా బ్రాండ్ క్రింద లక్ష నుండి 50 లక్షల వరకు గల యూనిట్లను మరియు కోటి రూపాయల విలువగల అక్ష్యా హబ్ ను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, హౌసింగ్ పీడీ వెంకటసుబ్బయ్య, జిల్లా పంచాయతీ అధికారి మంజులవాణి జిల్లా మత్స్యశాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు.