PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజలు ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి.. అదనపు ఎస్పీ

1 min read

పల్లెవెలుగు వెబ్ కృష్ణ : కృష్ణ మండలం తెలంగాణ…….ప్రజలలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేందుకే, శాంతియుత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించడానికి జిల్లా పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలతో (SSB) ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందని,ప్రజలకు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యం అని అదనపు ఎస్పీ నాగేంద్రుడు  తెలిపారు.ఈరోజు సాయంత్రం మగనుర్ టౌన్ లో, వడ్వట్ గ్రామం లో  పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ ను  నిర్వహించడం జరిగిందని తెలిపారు.ఈ సందర్భంగా అదనపు ఎస్పీ  మాట్లాడుతూ…అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు మరియు ప్రజలలో ఆత్మ విషయాన్ని విశ్వాసాన్ని పెంపొందించేందుకు ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందని అలాగే ప్రజలందరికీ జిల్లా పోలీసులు ఎల్లవేళలా తోడుంటారని ప్రజల్లో ధైర్యాన్ని కల్పించడానికి  ప్లగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది అని అదనపు ఎస్పీ తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడమే లక్ష్యంగా ఈ ఫ్లాగ్ మార్చ్ లు నిర్వహించడం జరుగుతుంది. ఎన్నికల సమయంలో కేంద్ర బలగాలు కీలకపాత్రను పోషిస్తాయని పోలింగ్ కేంద్రాల నందు సాయుద బలగాలతో కలిసి జిల్లా పోలీసు సిబ్బంది విధులను నిర్వహిస్తుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో SI మల్లేష్, కేంద్ర సాయుధ బలగాలు, పోలీసు సిబ్బంది మొదలగు వారు పాల్గొన్నారు.

About Author