అర్జీలు కు పరిష్కారం చూపుతాం.. మున్సిపల్ కమిషనర్ హామీ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయములోని ఓల్డ్ కౌన్సిల్ హాలు యందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో, ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరిస్తున్న మునిసిపల్ శాఖ అధికారులు.
1) ముదిరాజ్ నగర్ లోని కాలనీవాసులు తమ ఏరియాలో ఏర్పాటు చేసిన సెల్ టవర్ ను తీసివేయాలని కోరుతూ, కాలనీ వాసులంతా కమిషనర్ కి వినతిపత్రం ఇచ్చారు.
2) అశోక్ నగర్ లోని కాలనీ వాసులంతా తమ ఏరియాకి నీటి సరఫరా కొరత ఏర్పడిందని దీన్ని సత్వరమే పరిశీలించాలని పరిష్కరించాలని కోరుతూ కాలనీవాసులు కమిషనర్ కి వినతిపత్రం ఇచ్చారు.
3) మారుతి నగర్ లోని నివాసం ఉంటున్న పుల్లారెడ్డి మరియు చాందు హుస్సేన్ తమ ఏరియాలో ఉన్న పార్కును అభివృద్ధి చేయాలని (వాకింగ్ ట్రాక్, గేటు, కాంపౌండ్ వాల్ మరియు సిట్టింగ్ బెంచ్ వేయాలని) కమిషనర్ ని కోరుకున్నారు.
4) పింజారి ఏరిలో నివాసం ఉంటున్న షబానా తమకు సత్వరమే మంజూరైన TIDCO ఇళ్లను తమకు అందజేయాలని కమిషనర్ కి వినతిపత్రం ఇచ్చారు.
5) గీతా నగర్ అసోసియేషన్ వారు తమ ఏరియాలో ఉన్న పార్కును మరియు డ్రైనేజీలను అభివృద్ధి చేయాలని కమిషనర్ కి వినతి పత్రం ఇచ్చారు.
6) సోమిశెట్టి నగర్ లో నివాసం ఉంటున్న పి శ్రీనివాసులు తమ ఏరియాకి త్రాగునీటి సరఫరా సమయాన్ని పెంచగలరని కమిషనర్ కి వినతిపత్రం ఇచ్చారు.
7) వీనస్ కాలనీలో నివాసం అంటున్న శరత్ రావు తమ ఏరియాలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉన్నదని దీనిపై వెంటనే చొరవ చూపాలని కమిషనర్ ని కోరుకున్నారు.
8) కల్లూరు లో నివాసం ఉంటున్న నాయకంటి మహేంద్ర తమ ఏరియాలో తాగునీటి సరఫరా సమయాన్ని పెంచాలని కమిషనర్ కి వినతిపత్రం ఇచ్చారు.
స్పందన కార్యక్రమంలో అర్జీలు స్వీకరించి తక్షణ వీటిపై పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చిన కర్నూల్ మున్సిపల్ శాఖ కమిషనర్ ఐఏఎస్ భార్గవ్ తేజ . ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు ఎస్ ఈ వేణుగోపాల్ , డిసిపి మోహన్ కుమార్ , హెల్త్ ఆఫీసర్ విశ్వేశ్వర రావు , మేనేజర్ చిన్న రాముడు మరియు ఇతర అధికారులు.