PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగన్ అంటే దోచుకో దాచుకో …

1 min read

– కమ్యూనిస్టులు ప్రజల కోసం సేవ చేస్తారు..

– సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్ విమర్శ                                                         

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దోచుకో దాచుకో  అన్న విధంగా రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్ విమర్శించాారు. సోమవారం సిపిఎం  ఆధ్వర్యంలో ప్రజారక్షణభేరి బస్సు యాత్ర ఆదోనిలో ప్రారంభమై ఆలూరు  మీదుగా పత్తికొండ చేరుకుంది. పత్తికొండలో ఆర్టీసీ బస్టాండ్ నుండి పత్తికొండ, తుగ్గలి, మద్దికేర మండలాల సిపిఎం నాయకులు కార్యకర్తలు ప్రజారక్షణ భేరీ బస్సు యాత్రకు స్వాగతం పలికారు. యాత్ర నాలుగు స్తంభాల కూడలి మీదుగా అంబేద్కర్ సర్కిల్ బహిరంగ సభకు చేరుకుంది. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రంగారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో కర్నూలు మాజీ ఎమ్మెల్యే గఫూరు హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని ధర్నాలు చేస్తే అక్రమ అరెస్టులు గృహనిబంధాలు చేయడం దుర్మార్గపు చర్య అనిి మండిపడ్డారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తూ, బడ్జెట్లో కోత కోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కుటుంబానికి 200 రోజులు పని దినాలు కల్పించి, 600 రు. వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బిజెపి ప్రభుత్వం  భారీ పరిశ్రమలు కల్పించలేదని,ప్రత్యేక హోదా వెనకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ, రైల్వే జోన్లు విశాఖను ప్రకటించలేదని, పోలవరం కృష్ణా జలాలు పంపకాలపై అన్యాయం చేస్తుందని  అన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యే మంత్రు లు  ఇసుక, ఎర్రమట్టి, మద్యం సిమెంటు, ప్రభుత్వ భూములను కబ్జాలు, పాల్పడుతున్నారన్నారు. ఆశా వర్కర్లు అంగన్వాడి వర్కర్లకు కేవలం 7000 జీతం ఇస్తూ,  అమ్మ ఒడి చేయూత  మరిన్ని ప్రభుత్వ పథకాలు వర్తింప చేయకుండా మోసం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలు లేకపోవడంతో బతుకుతెరువు కోసం సుదూర ప్రాంతాలకు కడప, బెంగళూరు మహానగరాలకు పిల్లాపాపలతో వెళ్తున్నారని అన్నారు. వర్ష బావ పరిస్థితులు వల్ల రైతులు వేసిన  పంటలు ఎండిపోయి రైతంగం పుట్టెడు దుఃఖంలో ఉన్న, కరువు సహాయక చర్యలు చేపట్టకపోవడం విచారకరమన్నారు. ఇప్పటివరకు కరువు మండలాలుగా ప్రకటించకపోగా ఈ ప్రాంతంలో ఏవేవో చేస్తామని హామీలు ఇవ్వడం సిగ్గుచేటు అన్నారు. జూన్ ఒకటో తేదీ జగన్మోహన్ రెడ్డి పత్తికొండలోపర్యటన సందర్భంగా  రెండు నెలల లోపు టమోటా ప్రాసెసింగ్ ఏర్పాటు చేయాలని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రైతులకు పంట పొలాలలో నాణ్యత గల టమోటాలను పండించడం నేర్పించాలని అన్నారు. పత్తికొండ నియోజకవర్గం లోని తుగ్గలి మండలం ఎద్దులదొడ్డి గ్రామంలో ఓ దళితురాలిపై అత్యాచారం జరిగితే పోలీస్ స్టేషన్లో పంచాయతీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. తానేటి వనిత ఓ దళిత హోం మంత్రిగా ఉంటూ రేపల్లెలో భర్త  ఉండగానే  భార్యపై అత్యాచారం జరిగితే ఆవేశంలో చేశారని అనడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు లేకపోవడంతో నిరుద్యోగ యువత ఉపాధి లేక తీవ్రర ఇబ్బందులుు పడుతున్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే చెరువులకు నీళ్లు ఎట్లా వస్తాయని ప్రశ్నించారు. 2006లో హంద్రీనీవాకు చెరువుల నింపాలని పాదయాత్ర చేశామని తెలిపారు. టిడిపి, జనసేన, వైసిపి ప్రజా సమస్యలను పక్కనపెట్టి తమ ఎత్తుగడలను కోసం పనిచేస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో హక్కుల కోసం కార్మికులు కర్షకులు రైతులు ప్రతి ఒక్కరు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు వై కృష్ణయ్య, శివ నాగమణి సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశ కార్యవర్గ సభ్యులు బి రామాంజనేయులు  రామకృష్ణ రాధాకృష్ణ వీరశేఖర్, సిపిఎం మండల నాయకులు దస్తగిరి గోపాల్ పెద్దహుల్తి సురేంద్ర సిద్దయ్య గౌడ్ గంగన్న రామాంజినేయులు శ్రీరాములు కొండారెడ్డి రవి రాముడు అశోక్  ప్రజాసంఘాల నాయకులు రమేష్ తాజ్ మహమ్మద్ కాశి మధు  వినోద్ వీరన్న   రైతులు తదితరులు పాల్గొన్నారు.

About Author