సర్దార్ వల్లభాయి పటేల్ సేవలు స్ఫూర్తిదాయకం
1 min readమహనీయుల బాటలో యువత నడవాలి..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: సర్దార్ వల్లభాయి పటేల్ సేవలు స్ఫూర్తిదాయకమని మహనీయుల బాటలో యువత నడవాలని బిజెపి నంద్యాల జిల్లా కార్యదర్శి గూడూరు రవికుమార్ రెడ్డి అన్నారు.ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నందికొట్కూరు మండల అధ్యక్షులు కాకర్ల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నందికొట్కూరు పట్టణంలోనిసర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఘన నివాళులర్పించిన అనంతరం స్థానిక బిజెపి పార్టీ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా.భారతీయ జనతా పార్టీ నంద్యాల జిల్లా కార్యదర్శి గూడూరు రవికుమార్ రెడ్డి , భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర నాయకులు గూడూరు శివారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యానంతరం దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించేందుకు పటేల్ చేసిన కృషి అనిర్వచనీయమని అన్నారు. భారతదేశం భిన్న మతాల, సంస్కృతుల సమ్మేళనం. అలాంటి దేశాన్ని ఒకే తాటిపైకి తెచ్చేందుకు అహర్నిశలు ఆయన కృషిచేశారని తెలిపారు. ఐక్యతా పరుగులో పెద్దఎత్తున ప్రజలు, విద్యార్థులు పాల్గొనడం హర్షణీయమన్నారు.దేశ స్వాతంత్రం కోసం పాటుపడిన మహనీయుల బాటలో యువత నడవాలని తెలిపారు.సర్దార్ వల్లభాయి పటేల్ సేవలు స్ఫూర్తిదాయకమన్నారు.అంతేకాకుండా కండ ఖండాలుగా ఉన్న భారతదేశాన్ని ఏక ఖండంగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే చెందిందని అందుకే ఆయన జన్మదినాన్ని జాతీయ సమైక్య దినంగా ప్రతి సంవత్సరము జరుపుకుంటున్నామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరుబీజేపీ మండల నాయకులు నవీన్ కుమార్ , ఈశ్వర , శ్రీకాంత్ రావు , ధర్మేష్ , నిఖిల్ ఆచారి , వేణు , భార్గవ రాముడు , మల్లికార్జున్ రెడ్డి , బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.