PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆస్పత్రుల్లో వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలి

1 min read

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ  అమలు మరింత పెరగాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన

పల్లెవెలుగు వెబ్  కర్నూలు:  ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన వైద్యాధికారులను అదేశించారు. మంగళవారం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ధన్వంతరి సమావేశ మందిరంలో వివిధ విభాగాల హెచ్ఓడి లు, ప్రొఫెసర్స్, వైద్య సిబ్బందితో  ఆస్పత్రుల్లో వైద్య సేవలు, ఆరోగ్య శ్రీ అమలు, వైద్య పరికరాలు, సిబ్బంది అవసరత అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ  ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల హాజరు చాలా ముఖ్యమని తెలిపారు..ఆయా విభాగాల అధిపతులు వారి వారి విభాగాల్లో పిజి లు, హౌస్ సర్జన్ లు, ఇతర వైద్య సిబ్బంది విధులకు సక్రమంగా హాజరవుతున్నారా, ప్రజలకు సరైన వైద్య సేవలు అందిస్తున్నారా అన్న విషయాలపై పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.. నిన్న  ఓపి కౌంటర్ కు కొంతమంది వ్యక్తులను పంపించి ర్యాండమ్ గా చెక్ చేయించడం జరిగిందని, అయితే అక్కడ  పిజి లు, హౌజ్ సర్జన్, డాక్టర్లు అందుబాటులో  లేరని, స్టాఫ్ నర్స్ ఓపి రాసి ఇచ్చారని, స్టాఫ్ నర్స్ కు ఓపి రాసి ఇచ్చే అధికారం ఉంటుందా అని కలెక్టర్ వైద్యాధికారులను ప్రశ్నించారు. అదే విధంగా ప్రిస్క్రిప్షన్ లో రాసిన మెడిసిన్స్ ఆస్పత్రి లో అందుబాటులో ఉన్నప్పటికీ  బయట మెడికల్ షాప్ లో తీసుకొమ్మని పంపించారన్నారు..టెస్ట్ లకు, మందులకు   బయటకు పంపొద్దని చెప్పామన్నారు.. ఇకపై ఇలా జరక్కూడదని కలెక్టర్ స్పష్టం చేశారు…వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగేలా మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు..మందులు, టెస్ట్ లు బయటకు రాయకూడదని,  హెచ్ఓడి లు వైద్యుల హజరుపై పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.. ఆస్పత్రి లో  ఉన్న వ్యర్థ పదార్థాలను కాంట్రాక్టర్,  మున్సిపల్ అధికారులకు  సరైన సమయానికి  తీసుకెళ్లే విధంగా    చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం  పేదవారికి మంచి  వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో  కోట్ల రూపాయలను ఖర్చు చేసి ప్రైవేట్ ఆస్పత్రులలో అందుబాటులో లేని పరికరాలు కూడా ప్రభుత్వ ఆస్పత్రులలో అందుబాటులో  ఉండే విధంగా చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఆరోగ్య శ్రీ కింద ప్రభుత్వ ఆసుపత్రుల కంటే  ప్రైవేట్ ఆస్పత్రులలోనే  ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయని కలెక్టర్ తెలిపారు.. పీహెచ్సీ ల్లో సిబ్బంది కొరత లేదని, అయినా కూడా ప్రసవాలు చేయలేక పోతున్నారని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు..GGH లో ఆరోగ్యశ్రీ కింద నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తున్నామని ఆయా విభాగాల అధిపతులు కలెక్టర్ కు వివరించారు.. బాగా చేస్తున్నామని తృప్తి పడవద్దని, మనం చేస్తున్నది కొంచెమే నని కలెక్టర్ పేర్కొన్నారు…ప్రభుత్వ ఆస్పత్రులలో ఆరోగ్య శ్రీ కింద ఎక్కువ కేసులు చేయాలని, క్లైమ్ పెరిగే విధంగా చర్యలు కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు.  వివిధ విభాగాలలో వైద్య పరికరాలు,మౌలిక వసతులు, డాక్టర్లు ఎంతమంది ఉన్నారు అని హెచ్ఓడి లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.  న్యూరాలజీ విభాగంలో బేసిక్ స్ట్రోక్ యూనిట్, క్వాలిఫైడ్ న్యూరాలజిస్ట్, న్యూరో సర్జన్, ఫిజియథెరపిస్ట్లు,ఎలక్ట్రో ఫిజియాలజిస్ట్ అవసరం ఉందని   న్యూరాలజీ హెచ్ఓడి  కలెక్టర్ దృష్టికి తెచ్చారు.. ఇలాగే అన్ని విభాగాల అధిపతులు అవసరమైన పరికరాలు,వైద్యుల అవసరం గురించి వివరించారు..ఈ వివరాలన్నీ తనకు నోట్ రూపంలో అందచేయాలని కలెక్టర్ సూచించారు..వైద్య పరికరాల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటానని, వైద్యుల నియామకాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతానని కలెక్టర్ తెలిపారు.గత హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశంలో నిర్ణయించిన విధంగా చేపట్టాల్సిన  మెయింటినెన్స్ పనులు  ఎంతవరకు వచ్చాయని ఎపిఎస్ఎమ్ఐడిసి ఈఈ శివకుమార్  ని ఆరా తీశారు. రూ.3 కోట్లు మెడికల్ కళాశాలకు, రూ.3 కోట్లు ఆస్పత్రికి మెయింటినెన్స్ నిధులు మంజూరు అయ్యాయని, వీటికి టెండర్లు పిలిచామని  ఈఈ కలెక్టర్ కి వివరించారు…టెండర్లు ఆలస్యం కాకుండా  ప్రత్యేక చొరవ తీసుకొని త్వరితగతిన పనులు చేయించాలని కలెక్టర్  ఈ ఈ  ని ఆదేశించారు….ఆయా హెచ్ ఓ డి లను సంప్రదించి ఏ పనులు అవసరమో వాటిని చేయించాలని సూచించారు..స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్, క్యాత్ లాబ్ ఇన్స్టలేషన్,డయాగ్నొస్టిక్ ల్యాబ్ గురించి కలెక్టర్ ఆరా తీశారు.. నవంబర్ ఆఖరు లోపు స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ పనులు పూర్తి అవుతాయని, క్యాత్ లాబ్ ఇన్స్టలేషన్ 2,3 రోజుల్లోపు పూర్తి అవుతుందని, డయాగ్నొస్టిక్ ల్యాబ్ ను సోమవారం లోపు స్వాధీనం చేస్తామని ఈ ఈ తెలిపారు..డయాగ్నొస్టిక్ ల్యాబ్ లో టెస్ట్ కు చేయడానికి అన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా అని ఆయా విభాగాల హెచ్ ఓ డి లు చెక్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.సమావేశంలో ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ వెంకట రంగారెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రభాకర్ రెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్, డిఎంహెచ్ఓ రామ గిడ్డయ్య, ఎపిఎస్ఎమ్ఐడిసి ఈఈ శివకుమార్, వివిధ విభాగాల హెచ్ఓడి లు, ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author