మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 39వ వర్ధంతి
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి ఎం అమానుల్లా ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు కలిసి ఆధునిక ప్రపంచంలో అధోహరించిన రెండవ మహిళ మణి దివంగత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ నేడు 39వ వర్ధంతి కార్యక్రమం జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ సహాయ కార్యదర్శి ఎం అమానుల్లా మాట్లాడుతూ ఒకటిన్నర దశాబ్దం పాటు భారతదేశానికి ప్రధానిగా అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రజా ధరణ పొందిన ప్రధానిగా పేరుపొందారు. గరీబీ హటావో అనే నినాదానికి వాస్తు రూపమిచ్చి నిరుపేదలలో ఆత్మవిశ్వాసం కలిగించింది. 1969 లో దేశంలో మొదటిసారిగా 14 బ్యాంకులను జాతీయ చేయడం జరిగింది. ఆమె ప్రధానిగా ఉన్నప్పుడు మొదటిసారిగా 1974 ఫుక్రాన్ లో అణు పరీక్షలు చేపట్టి విజయం సాధించారు. 1971లో నాటి అగ్ర రాజ్యమైన రష్యాతో 20 సంవత్సరం శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. 20 సూత్రాల ప్రణాళికను ప్రవేశపెట్టి భూమిలేని గ్రామీణ శ్రామికులకు పని గ్యారంటీ కార్యక్రమం చేపట్టి మనదేశ అవునత్యానికి ప్రపంచానికి చాటి చెప్పింది. 1971లో భారతరత్న అవార్డు పొందిన భారతదేశ తొలి మహిళగా పేరుపొందారు. 1984 అక్టోబర్ 31న ప్రాణాలను కాపాడడానికి నియమించ బిడ్డ అంగరక్షకులే ఆమెను దారుణంగా చంపి వేయడం జరిగింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 149వ జయంతి కార్యక్రమం కూడా జరపడం జరిగింది. భారతదేశంలో ఉక్కుమనిషిగా పేరుపొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రాప్రతమా భారతదేశ తొలి ఉప ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరియు భారతదేశ తొలి హోం మినిస్టర్ గా పనిచేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉగ్రవాదాన్ని అణిచివేసి ఆర్ఎస్ఎస్ ను తొలగించాలని ఆయన చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కాంగ్రెస్ జిల్లా సహాయ కార్యదర్శి ఎం. అమానుల్లా మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పీరా సాబ్. రాందాసు . కాళప్ప. సిద్దయ్య కోనేరు మల్లయ్య. నాగప్ప. కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది.