జన్మదిన వేడుకలుకు దూరం: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
1 min readపల్లెవెలుగువెబ్, రాయచోటి: కోవిడ్ కారణంగా ఎంతో మంది జీవితాలు చిన్నాభిన్నమయ్యాయని, మరెందరో మృతి చెందారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ నెల 15న జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. పార్టీనాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు తనను కలిసేందుకు రావద్దని, ఎక్కడా కేక్ కటింగ్ లు, హంగూ ఆర్భాటాలు చేపట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేసారు. సోషియల్ మీడియాలో కూడా ఎవ్వరూ పోస్టింగ్స్ పెట్టొదని కోరారు.