11 మంది తల సేమియా చిన్నారులకు రక్త మార్పిడి..
1 min read– చైర్మన్ బివి కృష్ణారెడ్డి
పరీక్షలు నిర్వహించిన డాక్టర్ ఆర్ ఎస్ ఆర్ కె వరప్రసాదరావు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్ క్రాస్ తలసీమియా భవనంలో 11 మంది తల సేమియా చిన్నారులకు రక్తమార్పిడి చికిత్స జరిగినట్లు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బి వి కృష్ణారెడ్డి తెలిపారు. రెడ్ క్రాస్ వైద్యుడు డాక్టర్ ఆర్ ఎస్ ఆర్ కే వరప్రసాదరావు తల సేమియా చిన్నారులను పరీక్షించి అవసరమైన మందులను సూచించారు. అనంతరం డాక్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ జన్యుపరమైన వ్యాధులు రాకుండా ఉండాలంటే పెళ్లి చేసుకోబోయే యువతి యువకుల ముందస్తుగా కొన్ని రకాల రక్త పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ఈరోజు తల సేమియా చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులకు 30 మందికి ఉచిత భోజనం ఏర్పాటు చేసిన దాత మాతృదేవోభవ సేవా ట్రస్ట్ చైర్మన్ వి. కృష్ణమోహనరావుకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ కార్యదర్శి కేబీ సీతారాం, మానవత సభ్యులు కడియాల కృష్ణారావు, రత్నాకరరావు తదితరులు పాల్గొన్నారు.