‘చైల్డ్ లైన్–1098’ వాల్ పోస్టర్ విడుదల
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతిఒక్కరూ సహకరించాలని ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప పిలుపునిచ్చారు. శనివారం ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో చైల్డ్‌లైన్–1098’ వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ఫక్కీరప్ప మాట్లాడుతూ కర్మాగారాల్లో, దుకాణాల్లో, ఇతర పనుల్లోకి వెళ్ళి తల్లిదండ్రులకు ఆర్థిక సాయాన్ని అందిచేందుకు బాల కార్మికులుగా మారి పని చేస్తున్నారన్నారు. చదువుకోవాలని పిల్లలను వాళ్ల తల్లిదండ్రులు ప్రోత్సహించిన నాడే బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనవుతుందని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికులను గుర్తిస్తే చైల్డ్ లైన్ 1098కి సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో Child Welfare Committee (CWC) చైర్మన్ మనోహర్ రాజు, Juvenile Justice Board (JJH) Superintendent రామ్మోహన్ రెడ్డి , APARD డైరెక్టర్ జి. తిరుపతి రెడ్డి , 1098 Child-line జిల్లా కోఆర్డినేటర్ డి. సుంకన్న , APARD admn PD GV రెడ్డి , చైల్డ్ రైట్స్ ఫోరమ్ కన్వీనర్ B చెన్నయ్య , MS Foundation President K సుధాకర్, CWC మెంబర్ మాధవి పాల్గొన్నారు.