PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రూ. కోటి విలువ చేసే బంగారు ఆభరణాలు పట్టివేత

1 min read

– స్వాధీనం చేసుకుని.. కేసు నమోదు చేసిన సెబ్​ పోలీసులు

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : రాష్ట్ర సరిహద్దు పంచలింగాల చెక్​ పోస్టు వద్ద శనివారం సెబ్​ పోలీసులు రూ. కోటి 8లక్షల 61వేల 474 విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. చెక్​ పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కల్లూరు చింతలముని నగర్​కు చెందిన కేజీ సత్యనారాయణ హైదరాబాద్​ నుంచి కర్నూలుకు ఎలాంటి అనుమతులు లేకుండా 1 కేజీ 818 గ్రాముల బంగారు ఆభరణాలను అద్దె వాహనంలో రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. సత్యనారాయణ ను విచారించగా.. కర్నూలు షరాఫ్​ బజారులోని బిలకంటి నాగిశెట్టి బంగారు షాపులో గుమస్తాగా పని చేస్తానని, హైదరాబాద్​ శ్రీబాలాజి జ్యువెలర్స్​ నుంచి ఆభరణాలు తీసుకొస్తున్నట్లు పేర్కొన్నాడు. బంగారు ఆభరణాలకు సంబంధించి ఎలాంటి ఆధార పత్రాలు లేకపోవడంతో అక్రమ రవాణాగా పరిగణిస్తూ సీజ్ చేశారు. కేసు నమోదు చేసి, బంగారు ఆభరణాలను తాలూకా పోలీసులకు అప్పగించినట్లు సీఐ లక్ష్మి దుర్గయ్య వెల్లడించారు.

About Author