పత్తికొండలో న్యాయవాదులు రిలే నిరాహారదీక్షలు
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఆంధ్ర ప్రదేశ్ బార్ కౌన్సిల్ అనాలోచితంగా పెంచిన రూ: 20/- వెల్పేర్ స్టాంపును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, గురువారం పత్తికొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక నాలుగు స్తంభాల దగ్గర ప్రధాన రహదారిలో రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. సమావేశానికి స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్. కృష్ణయ్య అధ్యక్షత వహించగా, కార్యక్రమన్నీ ఉద్దేశించి సీనియర్ న్యాయవాదులు పి. ఎల్లారెడ్డి, ఏ. మై రాముడు లు మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్ బార్ కౌన్సిల్ అనాలోచిత నిర్ణయం వలన అక్టోబర్ నెల 5 వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. ఇప్పటికే రూ: 100/- వెల్పేర్ స్టాంప్ ఉందని, అదనంగా మరో రూ:20/- వెల్పేర్ స్టాంపును తీసుకు రావడం చాలా దుర్మార్గం అన్నారు. బార్ కౌన్సిల్ వారి ఈ అనాలోచిత నిర్ణయం వలన పరోక్షంగా భారం కాక్షి దారుల పై పడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. రూ: 20/- వెల్పేర్ స్టాంపును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు పై దాడులు జరుగు తున్నాయని న్యాయవాదుల కు రక్షణ చట్టంను తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.న్యాయవాదులకు రక్షణ చట్టం లేని కారణంగా దేశవ్యాప్తంగా నిత్యం న్యాయవాదుల పైన దాడులు జరుగుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో కిడ్నాప్లు చేసి చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 35 సంవత్సరాలు దాటిన న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఉన్నారని, వారికి వెల్ఫేర్ ఫండ్ అవకాశం లేకుండా పోయిందని వారికి కూడా అవకాశం కల్పించాలని కోరారు. ఈ రిలే నిరాహారదీక్షలు రెండు రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు.మొదటి రోజు రిలే దీక్షలో భారతదేశం కార్యదర్శి బి. రంగ స్వామి, న్యాయవాదులు బి. సురేంద్ర కుమార్, బి. ప్రసాద్ బాబు, యస్. సుధ కృష్ణ, ఎం. నారాయణ స్వామి, కె. దామోదర, డి.బాల బాషా, జి. భాస్కర్, బి. టి. నాగ లక్ష్మయ్య, పి. వాసు దేవా నాయుడు, రాజ శేఖర్ నాయుడు, నరస రావు, జె. రవి కుమార్, లక్ష్మణ స్వామి నాయుడు, నంది వీరేశ్, చంద్ర శేఖర్, కబీర్ దాస్, నెట్టేకల్లు, లక్ష్మన్న, రాజా వర్ధన్ రెడ్డి కూర్చున్నారు. అలాగే కార్యక్రమానికి సీనియర్, జూనియర్ న్యాయవాదులు కె. సురేష్ కుమార్ ,ఎం. చంద్ర శేఖర్ నాయుడు, H. k.లక్మన్న,ఎం. మల్లి కార్జున, బి. రమేష్ బాబు, కె. నరసింహయ్య, కె రఘు శేఖర్, కె. శ్రీ కాంత్ రెడ్డి, మహేష్ ,మధు బాబు, పంప పాతి, డి. వెంకటేశ్వర్లు,కె. నరసింహులు, తదితరులు పాల్గొని, రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం తెలిపారు.