PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పత్తికొండలో 2వ రోజు కొనసాగిన న్యాయవాదుల రిలే నిరాహారదీక్షలు

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  ఆంధ్ర ప్రదేశ్ బార్ కౌన్సిల్  అనాలోచితంగా పెంచిన రూ: 20/- వెల్పేర్ స్టాంపును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ  పత్తికొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక నాలుగు స్తంభాల దగ్గర ప్రధాన రహదారిలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు రెండవ రోజు శుక్రవారం కొనసాగాయి.ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి స్థానిక బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి. రంగ స్వామి అధ్యక్షత వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సీనియర్ న్యాయవాదులు పి. ఎల్లారెడ్డి, ఎ. మై రాముడు, ఎ.సత్యనారాయణ లు మాట్లాడుతూ, ఆంధ్ర ప్రదేశ్ బార్ కౌన్సిల్ అనాలోచిత నిర్ణయం వలన అక్టోబర్ నెల 5 వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. ఇప్పటికే రూ: 100/- వెల్పేర్ స్టాంప్ ఉందని, అదనంగా మరో రూ:20/- వెల్పేర్ స్టాంపును తీసుకు రావడం చాలా అన్యాయమని అన్నారు. బార్ కౌన్సిల్ వారి ఈ అనాలోచిత నిర్ణయం వలన పరోక్షంగా కాక్షి దారుల పై భారం పడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. రూ: 20/- వెల్పేర్ స్టాంపును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు పై దాడులు జరుగు తున్నాయని న్యాయవాదులు కు రక్షణ చట్టంను తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.న్యాయవాదులకురక్షణచట్టం  లేనికారణంగాదేశవ్యాప్తంగానిత్యంన్యాయవాదుల పైన దాడులు జరుగుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో కిడ్నాప్లు చేసి చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  35 సంవత్సరాలు దాటిన న్యాయవాదులు  రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఉన్నారని,  వారికి వెల్ఫేర్ ఫండ్ అవకాశం లేకుండా పోయిందని వారికి కూడా అవకాశం కల్పించాలని కోరారు. ఈ రిలే నిరాహారదీక్షలు రెండు రోజుల పాటు కొనసాగాయి.  రెండవ రోజు రిలే దీక్షలో ఎన్.కృష్ణయ్య, బి. రమేష్ బాబు, హెచ్.మహేష్, ఎం. కాశీ విశ్వనాథ్, ఎం.అశోక్ కుమార్, కే.రఘు శేఖర్, ఆర్.రామన్న గౌడ్, ఎస్ బి సూరజ్ నబి, కే.హరికృష్ణ, జీ.శ్రీనివాస రెడ్డి జే వీ సంజన్న, కె. నరశింహులు, బి.మధు, ఎన్.రవి తేజ కూర్చున్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్, జూనియర్ న్యాయవాదులు పి . గోపాల్ రెడ్డి,జె . చంద్ర మోహన్ గౌడ్, బి.హల్తెన్న,వి.ఈరన్న, మల్లి కార్జున, నాగ భూషణ రెడ్డి, బాల బాషా, దామోదర ఆచారి తదితరులు పాల్గొన్నారు.

About Author