NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సంప్రదాయ రక్షణే విశ్వకళ్యాణాన్ని ఆవిష్కరిస్తుంది

1 min read

డాక్టర్ మల్లు వేంకటరెడ్డి

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల:  మన మహనీయులు అందించిన సంస్కృతి, సంప్రదాయాలు జాతి  నిర్మాణంతో పాటు విశ్వకళ్యాణానికి దోహదపడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో గోనెగండ్ల మండలం, పుట్టపాశం గ్రామంలోని శివాలయం నందు గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా గోపూజ మరియు కుంకుమార్చనతో పాటు ధార్మిక సభా కార్యక్రమాలు నిర్వహించారు. అంతకుముందు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి శివాలయం వరకు గోమాతతో నగర సంకీర్తన, శోభాయాత్ర చేశారు. మూడు రోజుల పాటు మేడా సుబ్రహ్మణ్యం స్వామి చేసిన ధార్మిక ప్రవచనాలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రేగటి నరసింహా రెడ్డి, ధార్మిక ప్రవచకులు బి.టి.రామచంద్రుడు, అర్చకులు నంబి రాజు, విశ్రాంత సహకార బ్యాంకు మేనేజర్ చెన్నూరు ఈశ్వరరెడ్డి, బి.టి.తిమ్మగురుడు, సి.యం. పెద్ద నాగన్న, కురవ రామకృష్ణ, బి.టి.గంగాధర్, కమ్మరి బ్రహ్మయ్య, సి.యం. వెంకటేశ్, కురవ సుంకన్నతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About Author