PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇంటర్నేషనల్ గుడ్ విల్ అంబాసిడర్ గా గుర్తింపు అవార్డు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సంస్థ అధ్యక్షులు, అసోసియేషన్ ఆఫ్ అలియన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సేవా సంస్థ ఇంటర్నేషనల్ కౌన్సిల్ చైర్ పర్సన్  లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు మలేషియా దేశం నుండి మలేషియన్ బోర్నియో అంబాసిడర్ ఆర్గనైజేషన్ నుండి  ఇంటర్నేషనల్ గుడ్ విల్ అంబాసిడర్ అవార్డును అంతర్జాలం ద్వారా జరిగిన సమావేశంలో అందజేసినట్లు తెలిపారు. నైస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ స్థాపించినప్పటి నుంచి గత 33 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా వృత్తి విద్యలపై శిక్షణ, మహిళా సాధికారకత పైన ఉచిత కంప్యూటర్ శిక్షణ, కుట్టు మరియు శారీ పెయింటింగ్ లపై శిక్షణ,  గ్లాస్ పెయింటింగ్ ,ఎంబ్రాయిడరీ పెయింటింగ్ మరియు దివ్యాంగుల ఉపాధి అవకాశాలపై శిక్షణ, రక్తదానం నేత్రదానం, అవయదానం లాంటి వాటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, న్యాయ విజ్ఞాన శిబిరాలు నిర్వహించడం, అన్నదాన కార్యక్రమాలు, మహిళలకు చీరల పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించడం, ప్రపంచశాంతి  మరియు మానవాక్కులపై అంతర్జాతీయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించడం, యువతలో సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా సంస్కృతిని ప్రోత్సహించడం తదితర సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కడం తమ సంస్థకు సమాజంపై మరింత బాధ్యతలు పెంచిందని రాయపాటి శ్రీనివాస్ తెలిపారు.

About Author