PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కురువ కులస్తులు పై దాడులు చేస్తే సంహిచేదిలేదు..

1 min read

కురువ చిన్న రాముడు పై హత్యాయత్నానికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన కురువ చిన్న రాముడి ఫై హత్య ప్రయత్నానికి  పాల్పడ్డ నిందితుల పై కఠిన చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా కురువ సంఘము అధ్యక్ష , ప్రధాన కార్యదర్శి పత్తికొండ శ్రీనివాసులు ,ఎం .కే .రంగస్వామి డిమాండ్ చేసారు.గత రెండు రోజుల క్రితం పొలం తగాదా విషయమై పొలం లో పని చేసుకుంటున్న  చిన్న రాముడు పై అదే గ్రామానికి చెందిన చిన్న సిద్ధయ్య కుమారుడు శ్రీధర్ ,,వెంకటరాముడు కుమారుడు నాయుడు ,పెద్ద వెంకన్న  కుమారులు అడవి రాముడు మరియు నాయుడు  ,చిన్న వెంకన్న కొడుకు సుధాకర్ ,కలిసి దాడి చేసి ఎడమ చెయ్యి విరగొట్టారు . జిల్లాలో ఉండే కురువ కులస్తులు పై దాడులు పెరిగాయని మా యెక్క మంచితనాన్ని చేతకాని తనంగా చూస్తూ సహించేది లేదని హెచ్చరించారు. ప్రతి దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గూడూరు మండలంలో కురవ కులస్తులపై దాడి రెండవది కావున అధికారులు దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దాడి విషయం తెలుసుకున్న కర్నూలు జిల్లా కురువ సంఘము నాయకులు ఈ రోజు ఉదయం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్న కురువ చిన్న  రాముడిని జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం .కే .రంగస్వామి ,గూడూరు మండల కురువ సంఘం అధ్యక్షులు కే .కృష్ణ ,జిల్లా నాయకులు బి .సి .తిరుపాల్ ,తవుడు శ్రీనివాసులు, కే .సి .నాగన్న ,చిన్న గిడయ్య ,అయ్యన్న తదితరులు పరామర్శించి హత్యాప్రయత్నానికి  పాల్పడ్డ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవలెనని కోరారు.

About Author