NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్ర సంపద దోచుకుంటున్న గజదొంగ జగన్

1 min read

– మహిళా సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ద్వేయం

– టీడీపీ మినీ మేనిఫెస్టోలో మహిళలకు ప్రాధాన్యత

– మన భవిష్యత్తు గ్యారంటీ చంద్రబాబు తోనే

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: మద్యం పాలసీతో  రాష్ట్ర ప్రజల సంపదవేల కోట్లను దోచుకుంటున్నా గజదొంగ జగన్మోహన్ రెడ్డి అని నంద్యాల పార్లమెంట్ ఇంచార్జి మాండ్ర శివానంద రెడ్డి అన్నారు.శనివారం నందికొట్కూరు మున్సిపాలిటీ లో పగిడ్యాల రోడ్డు లోని బైరెడ్డి నగర్ 3వ వార్డులో టీడీపీ పట్టణ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి ,  వార్డు ఇంచార్జ్ సత్తార్ మియ్య, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డిగారి  ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించి టిడిపి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా  నాయకులు శివానందరెడ్డి మాట్లాడుతూ 2019 ఎన్నికలలో ఒక్క అవకాశం అని జగన్ కి ఓటువేసి అధికారం కట్టబెట్టితే  ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా అభివృద్ధి, సంక్షేమపథకాలను ప్రజలకు అందించకపోగా విద్యుత్తు, ఆర్టీసీ చార్జీలను విపరీతంగా పెంచేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం జరుగుతోందని అన్నారు. ప్రజలంతా రాబోయే ఎన్నికలలో వైసీపీకి బుద్దిచెప్పాలని సిద్ధంగా ఉన్నారని తెలపడం జరిగినది. టిడిపి ప్రభుత్వం ఏర్పాటు జరిగాక అభివృద్ధితో పాటు సంక్షేమపథకాలు ప్రతి సామాజిక వర్గానికి అందేలా చూసే బాధ్యత చంద్రబాబు నాయుడుదే అని పేర్కొన్నారు.మహిళల సంక్షేమమే ద్వేయంగా మ్యానిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేయడం జరిగిదన్నారు. ప్రజలు ఇవ్వన్నీ గమనించి రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని ఓటుతో ఆశీర్వదించి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని ప్రజలను కోరారు.  కార్యక్రమంలో నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,టీడీపీ పట్టణ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జయసూర్య, ఐ టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి  ముర్తుజావలి, టీడీపీ నాయకులు జాకీర్ హుస్సేన్, న్యాయవాది నాగముని, మునాఫ్, రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి  షకీల్ అహమ్మద్, టీడీపీ నాయకులు వేణుగోపాల్, ఖాజాహుస్సేన్, జమీల్, రసూల్, రాజు, కృష్ణారెడ్డి, మోహన్, కళాకర్, సురేంద్ర, శ్రీను, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author