PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అభివృద్ధి పనులను పరిశీలించనున్న ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది:  మహానంది క్షేత్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను రేపు అనగా శనివారం ఉదయం శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి పరిశీలించనున్నారు. ఈనెల 14 తేదీ నుండి మహానంది క్షేత్రంలో కార్తీక మాసం నకు సంబంధించి నెలరోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. వీటికి సంబంధించి అధికారులు మరియు పాలకమండలి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు పారిశుద్ధ్య త్రాగునీరు వంటి వివరాలు చర్చకు వచ్చే అవకాశం తెలుస్తుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆలయ అధికారులు మరియు పాలకమండలి తెలియజేస్తున్న వీటిపై ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు తెలుస్తుంది. దీంతోపాటు తమ్మడపల్లె మరియు బొల్లవరం గ్రామాల మధ్య నెలకొన్న తెలుగు గంగ నీటి వివాదంపై కూడా జెడ్పిటిసి మహేశ్వర్ రెడ్డి ఆయన సోదరుడు సుబ్బారెడ్డి పై బొల్లవరం రైతుల ఫిర్యాదు మేరకు ఆ ప్రజా ప్రతినిధి పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. మండలానికి చెందిన ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి రెండు గ్రామాల మధ్య నీటి వివాదం పరిష్కరించాల్సింది పోయి రెచ్చగొట్టే విధంగా ఉండటంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలాగే ప్రవర్తిస్తే చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ఇలాంటివారు వల్ల చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నట్లు తెలుస్తుంది. మీడియా ప్రతినిధి పై దాడి కేసుకు సంబంధించి కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. అధికారుల విధులను కూడా ఆటంకం కలిగించారని అలా అయితే తాము ఎలా విధులు నిర్వహిస్తామని తెలుగు గంగా అధికారులు ఎమ్మెల్యే తో అన్నట్లు తెలుస్తుంది అలాంటి వారిపై చర్యలు తీసుకోకపోతే నష్టం కలిగే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి రైతులు తెలియజేసినట్లు సమాచారం. రైతులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది.

About Author