PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నూర్ భాషా దూదేకుల కులానికి  4 స్థానాలు ఇచ్చే పార్టీకే మా మద్దతు

1 min read

– నూర్ భాషా దూదేకుల ఆడబిడ్డలను వేధిస్తే తాటతీస్తాం

– నూరు బాషా దూదేకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎస్ బాజీ

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోవు సార్వత్రిక ఎన్నికలలో నూర్ భాషా దూదేకుల కులానికినాలుగు ఎమ్మెల్యే స్థానాలు పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన రాజకీయ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్ భాషా ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎస్ బాజీ పేర్కొన్నారు. శనివారం అన్నమయ్య జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్ భాషా ముస్లిం సంక్షేమ సంఘం అధ్యక్షులు పాలగిరి మౌలా ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా కేంద్రంలోని మాసాపేటలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నూర్ భాషా దూదేకుల సంఘం అధ్యక్షులు ఎస్ఎస్ బాజీ  హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా  నూరు భాషా దూదేకుల కులంలో సుమారు 25 లక్షల వరకు జనాభా విస్తరించి ఉందన్నారు. నూరు భాషా దూదేకుల కులం జనాభా ప్రాతిపదికన తమ కులానికి రాబోవు సార్వత్రిక ఎన్నికలలోనాలుగు ఎమ్మెల్యే స్థానాలకు టికెట్లు తమ కులం అభ్యర్థులకు ఇవ్వాలన్నారు. అలా  ఇచ్చిన రాజకీయ పార్టీకితమ కులం సంపూర్ణ మద్దతు ఇచ్చి తమ కులం అభ్యర్థులను ఎన్నికలలో గెలిపించుకుని తమ సత్తా నిరూపించుకుంటామన్నారు. అలాగే కొందరు ముస్లిం కుటుంబాలు నూర్ భాషా దూదేకుల ఆడబిడ్డలను పెళ్లి చేసుకుని  వేధిస్తున్నారని అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తాట తీస్తామని  హెచ్చరించారు.అనంతరం ఎస్ఎస్ బాజీకి దుశాలవా కప్పి పూలమాలవేసి ఘనంగా సన్మానించారు . ఈ కార్యక్రమం లో రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు మట్టిపాటి భాష,  కార్యదర్శి దూదేకుల సిద్దయ్య, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి కదిరి దస్తగిరి, ఆళ్లగడ్డ నియోజకవర్గం అధ్యక్షులు దస్తగిరి, రాష్ట్ర సలహాదారు పి ఫయాజుర్ రెహ్మాన్, అన్నమయ్య జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ యు.జమలుల్లా, చిత్తూరు జిల్లా అధ్యక్షులు వజ్రాల అన్వర్, తంబళ్లపల్లె అధ్యక్షులు చాన్ భాష, రాయచోటి అధ్యక్షులు వెండికట్ల అజ్మతుల్లా, అన్నమయ్య జిల్లా యూత్ ఉపాధ్యక్షులు ఇస్మాయిల్ (జబిఉల్ల), పీలేరు అధ్యక్షులు రెడ్డి తదితర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్ భాషా ముస్లిం సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author