త్రాగునీటి కొరకు 35 లక్షలు మంజూరు
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మండలంలోని రామనపల్లి గ్రామపంచాయతీలో త్రాగునీటి సమస్య ఉందని ప్రజల దాహార్తిని తీర్చేందుకు గ్రామ పంచాయతీకి సహకరించాలని ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ని రామనపల్లి గ్రామపంచాయతీ వైస్ ప్రెసిడెంట్ పు త్తా వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్ శ్రీలక్ష్మి కోరగా ఆయన వెంటనే స్పందించి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు పోవడం జరిగిందని రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్ శ్రీలక్ష్మి అన్నారు, శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, రామనపల్లి వైస్ ప్రెసిడెంట్ నేను కలిసి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి దగ్గరికెళ్ళి మాకు నీటి సమస్య ఉందని అలాగే త్రాగునీటి పైప్లైన్ కూడా దెబ్బతిన్నదని అని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి ముఖ్యమంత్రి దగ్గరికి ఈ విషయం తీసుకెళ్లి రామన పల్లె గ్రామానికి 35 లక్షలు పైప్లైన్ మంజూరు చేయించడం జరిగిందని ఆమె తెలియజేశారు, తాము అడిగి అడగగానే మా గ్రామానికి త్రాగునీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డికి ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు, అంతేకాకుండా నియోజవర్గంలోని ఏ మండలంలోనైనా ఏ గ్రామంలోనైనా పలానా సమస్య ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే ఆయన వెంటనే ఆ పనులు పూర్తయ్యే విధంగా అధికారులకు చెప్పి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు, అలాంటి వ్యక్తిని నియోజకవర్గ ప్రజలు తమ గుండెల్లో పెట్టుకొని ఎమ్మెల్యే ఎప్పుడు వచ్చింది రవీంద్రనాథ్ రెడ్డిని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం మనందరి బాధ్యత అని ఆమె తెలిపారు.