నవంబర్ 8న కేజీ టు పీజీ వరకు రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్
1 min read– కడప ఉక్కు పరిశ్రమ ప్రారంభించాలి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలి
– బంద్ కు సంబంధించిన గోడ పత్రికలు విడుదల చేస్తున్న AISF, AIYF విద్యార్థి యువజన సంఘాల నాయకులు
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: కడప ఉక్కు పరిశ్రమ ప్రారంభించాలని విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలని నవంబర్ 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కేజీ టు పీజీ వరకు విద్యాసంస్థల బంద్ జయప్రదం చేయాలని కోరుతూ, శనివారం పత్తికొండలో స్థానిక చదువుల రామయ్య భవనం నందు బంద్ కు సంబంధించిన గోడపత్రికలు విడుదల చేశారు.ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి. రామచంద్రయ్య, ఏ ఐ వై ఎఫ్ జిల్లా కార్యదర్శి కారుమంచి, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు అల్తాఫ్, మాట్లాడుతూ, దేశంలో ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎక్కడా కూడా ఉద్యోగాలు కల్పించిన పాపాన పోలేదన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తానని అనేక హామీలు ఇచ్చి ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయకుండా,, ఈ రాష్ట్రంలో లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఉపాధి కల్పిస్తూ వాళ్ల కుటుంబాలు పోషణకు ఆసరాగా నిలుస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమ కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు కుమ్మక్కై విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయాలని చూడడం చాలా దారుణమని మండిపడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విద్యార్థి యువజన సంఘాలు అనేక దఫాలుగా పోరాటాలు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చీమకుట్టినట్టుగా కూడా లేదన్నారు. అంతేకాకుండా ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమలను కార్పొరేట్ వ్యక్తులకు తాకట్టుపెట్టే యువచనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని తెలిపారు.. మరోపక్క విభజన చట్టంలో హామీలు రాయలసీమలోని కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ప్రారంభిస్తామని ఇప్పటికే అనేకసార్లు శంకుస్థాపనలు చేశారే తప్ప ఆచరణలో ప్రారంభించి పూర్తి చేసింది లేదని తెలిపారు. రాయలసీమ జిల్లాలో డిగ్రీలు పీజీలు పూర్తిచేసుకుని ఉద్యోగ అవకాశాలు లేక చెన్నైకు, బెంగళూరుకు, కేరళకు వలసలకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే నిరుద్యోగులను ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే రాయలసీమలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని విశాఖపట్నంలో దాదాపు వెయ్యి రోజుల నుంచి వామపక్ష విద్యార్థి యువజన కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న సందర్భంగా నవంబర్ 8వ తేదీన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బందుకు విద్యార్థి యువజన సంఘాలు పిలుపునివ్వడం జరిగిందని అన్నారు..ఈ బందుకు జిల్లాలో ఉన్న కార్పొరేట్ ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థల యాజమాన్యులు సహకరించి సంపూర్ణంగా బంద్ ప్రకటించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు నజీర్, ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్ష కార్యదర్శులు పెద్దయ్య, హనుమేష్, ఏఐఎస్ఎఫ్ పత్తికొండ మద్దికేర మండల కార్యదర్శులు శివ, శ్రీకాంత్, ఏఐవైఎఫ్ తుగ్గలి మండల అధ్యక్ష కార్యదర్శులు చిరంజీవి, వినోద్, ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు సమీర్, ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు వినోద్, రమేష్, ఏఐఎస్ఎఫ్ నాయకులు పవన్, భాష, తదితరులు పాల్గొన్నారు.