PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంగరంగ వైభవంగా శ్రీ ఇష్టకామ్యార్థ కాలభైరవ స్వామి చర విగ్రహ ప్రతిష్ట

1 min read

పల్లెవెలుగు  వెబ్ కడప:   కడప ఎంఎస్ కొటాలు నానాపల్లి వద్ద వెలసిన శ్రీ ఇష్టకామ్యార్థ కాలభైరవ స్వామి దేవాలయంలో ఆదివారం శ్రీ ఇష్టకామ్యార్థ కాలభైరవ స్వామి చర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం బాసట స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయపాలె మల్లికార్జున రెడ్డి పాల్గొన్నారు, ముందుగా స్వామివారిని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన పిమ్మట  శ్రీ ఇష్ట కామ్యార్థ కాలభైరవ స్వామి ఆలయం ఎదురుగా వేద పండితులతో హోమం నిర్వహించి వేదమంత్రాలతో స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగింది, ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయ పల్లె మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ, శ్రీ ఇష్టకామేర్థ కాలభైరవ స్వామిని నమ్ముకున్న వారికి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా, అంతా మంచే జరుగుతుందని స్వామివారిని దర్శించుకున్న వారికి ఏ లోటు లేకుండా ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉంటారని ఇక్కడి  భక్తుల విశ్వాసం అని ఆయన తెలిపారు, మైన్స్ అధికారి ఉమామహేశ్వరరావు  ఇష్టకామేర్థ కాలభైరవ స్వామివారి విగ్రహ కార్యక్రమానికి తాను ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషమని ఆయన తెలియజేశారు, ఈ సందర్భంగా శ్రీ ఇష్టకామ్యార్థ కాలభైరవ స్వామి ఆలయంలో ఆలయ కమిటీ అధ్యక్షులు బాలాజీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు భావించారు అనంతరం భక్తులకు ఇలాంటి అసౌకర్యాలు కలవకుండా తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాద వితరణ అందజేశారు, ఈ కార్యక్రమంలో బాసట స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, శ్రీనివాసుల రెడ్డి, పెద్ద బుద్ధి వెంకట శివప్రసాద్, మణికంఠ  రెడ్డి, శంకర్ రెడ్డి, రఘు, సాయి, యమల మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

About Author