PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళా కళాకారులకు దీపావళి కానుక చీరలు దుప్పట్లు పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా సుప్రసిద్ధ రంగస్థల మహిళా కళాకారులకు దీపావళి కానుక చీరలు మరియు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు మద్దూర్ నగర్ నందలి సూరన తెలుగుతోట నందు గౌరవ ముఖ్య అతిథి కర్నూలు జిల్లా కేంద్ర గ్రంథాలయ అధ్యక్షులు మద్దూరు సుభాష్ చంద్రబోస్ పాల్గొని మహిళా కళాకారులకు చీరల పంపిణీ దుప్పట్లు అందజేశారు. రంగస్థలం వృత్తి మహిళా కళాకారులకు గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని రంగస్థల కళాకారులకు చేయూత మహిళా కళాకారులకు దీపావళి కానుక చీరలు దుప్పట్లు పంపిణీ మహిళా కళాకారులు శ్రీమతి అరుణకుమారి రాధిక రాజ్యలక్ష్మి పద్మావతి అరుణ సరిత శోభారాణి మంజుల రేణుక వీరికి మద్దూరు సుభాష్ చంద్రబోస్ అందజేశారు. రంగస్థల కళాకారులకు దాతలు అందిస్తున్న సహాయ సహకారాలు అభినందనీయమని కర్నూలు జిల్లా రంగస్థలం మహిళా కళాకారులు తమ ప్రతిభను వెలికి తీయడానికి వేదికలు కల్పించాలని రెండవ బెటాలియన్ డి యస్ పి  ఎస్ మహబూబ్ బాషా తమ సహాయ సహకారాలు అందజేస్తామన్నారు.. కర్నూలు జిల్లా రంగస్థల మహిళా కళాకారులకు దీపావళి కానుక వస్త్ర పంపిణీ మరియు చలి దుప్పట్లు పంపిణీ చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని వృత్తి కళాకారులకు ప్రోత్సాహం ఇస్తే పోటీ నాటకాలలో స్త్రీ పురుషులు ఇద్దరికీ రంగస్థలం గుర్తింపు పొంది జిల్లాకు కీర్తి ప్రతిష్టలను రాష్ట్రస్థాయి జాతీయస్థాయి లో కర్నూలు కళాకారులు రాణించాలని ధాత డాక్టర్ సుభాన్ సార్ అన్నారు. నవంబర్ 14వ తేదీన షరీఫ్ నగర్ లో ఉచితంగా బీపీ షుగర్ వైద్య సేవలు ఉంటాయని ఈ సదావకాశం కళాకారులు వినియోగించుకోవాలని డాక్టర్ సుభాన్ కోరారు.. దీపావళి కానుక చీరలు దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో తెలుగు భాష జిల్లా ప్రధాన కార్యదర్శి జె ఎస్ ఆర్ కే శర్మ గానగంధర్వులు పి దస్తగిరి గాయకులు శ్రీ హెచ్ చంద్రన్న సారధ్యం పౌరాణిక పద్యాలు పాటలు అద్భుతంగా పాడారు.కర్నూలు జిల్లా రంగస్థలం ఆధ్వర్యంలో పి హనుమంతరావు చౌదరి బైలుప్పల షఫీయుల్లా అధ్యక్షతన జరిగిన సమావేశంలో కర్నూలు జిల్లా రంగస్థల కళాకారులు రచయిత ఎస్ డి వి అజిజ్  కర్నూలు కళాకారుల సంక్షేమ సంఘం గౌరవ సభ్యులు సయ్యద్ రోషణలి సిబి అజయ్ కుమార్ రంగస్థలం కళాకారులు కళాప్రియ తిరుపాలు గోవిందరాజులు రామకృష్ణ సుబ్బయ్య మనోహర్ బాబు డి పుల్లయ్య డి పార్వతి వెంకటేశ్వర్లు రమణాచారి, మహిళా కళాకారులు శ్రీమతి అరుణకుమారి రాధిక రాజ్యలక్ష్మి పద్మావతి అరుణ లక్ష్మీ ప్రసన్న మంజుల జ్యోతి మౌనిక రేణుక అరుణ రాజేశ్వరి శారదా దేవి సరిత శిరీష సావిత్రి ముంతాజ్ కర్నూలు జిల్లా రంగస్థలం మహిళా కళాకారులు దీపావళి కానుక చీరలు దుప్పట్లు అందుకున్నారు.ఇట్లు …బైలుప్పల షఫీయుల్లా ….కార్యనిర్వాహక కార్యదర్శి …కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారుల సంక్షేమ సంఘం..కర్నూలు జిల్లా … … …ప్రెస్ నోట్ తప్పక పెట్టగలరు .

About Author