ముఖ్యమంత్రి జగనన్న సంక్షేమ రాజ్యానికి పునాది “ప్రజా సంకల్పయాత్ర
1 min read“-రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ గుమ్మనూరు జయరాం
జగనన్న ప్రజా సంకల్ప యాత్రకి నేటితో సరిగ్గా ఆరేళ్లు
ముఖ్యమంత్రి అయ్యాక ‘నవరత్నాలతో’ పేద, మద్య తరగతి వర్గాలకు అండగా నిలిచారు
-రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం
పల్లెవెలుగు వెబ్ ఆలూరు : జననేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు ప్రతిపక్ష నేతగా 341 రోజుల పాటు ప్రజా క్షేత్రంలో పాదయాత్రగా 3648 కిలోమీటర్లు నడిచి ప్రజల్లో నేను విన్నాను.. నేనున్నాను అని భరోసా కలిగించిన ప్రజాసంకల్ప యాత్ర పాదయాత్ర 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా..ఈ రోజు ఆలూరు పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి, కేక్ కటింగ్ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారు మరియు వారి సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులు ఈ కార్యక్రమంలో ఆలూరు జడ్పీటీసీ ఏరూరు శేఖర్,మండల కన్వీనర్లు వీరేష్,మారయ్య,జిల్లా కార్యదర్శి రాంభీం నాయుడు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.