రంగం జిల్లా కార్యదర్శి కరుణాకర్ పల్లెవెలుగు వెబ్, గోనెగండ్ల: కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన కళాకారులకు జీవన భృతిగా నెలకు రూ.10వేల ఆర్థిక సహాయం అందించాలని రంగం ప్రజా సాంస్కృతిక వేదిక జిల్లా కార్యదర్శి కరుణాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం గోనెగండ్ల లోని మిమిక్రి ఓంకార్ ఆర్కేస్ట్రా రిహార్సల్ కేంద్రం వద్ద కళాకారులు నిరసన తెలిపారు. కళామతల్లి ముద్ద బిడ్డలు కళాకారులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ‘కళ’నే నమ్ముకుని జీవనం సాగిస్తున్న కళాకారుల కుటుంబాలు ఉపాధి లేక జీవనం అస్తవ్యస్థంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కళాకారులకు ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో రంగస్థలం కళాకారులు కౌలుట్లయ్య, జెజ్జి బాయ్, హార్మోనిస్టు మురళి కృష్ణ,ఆర్కెస్త్రా టీమ్ మిమిక్రి ఓంకార్,గాయకుడు ఖాజా తదితరులు పాల్గొన్నారు.