PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జ‌గ‌న్ ప్రజాసంకల్ప పాదయాత్ర మరపురాని చరిత్ర

1 min read

– పాదయాత్ర ఆరేళ్ళు పూర్తయిన సందర్భంగా వేడుకలు

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  దేశ రాజకీయాల్లోనే జగనన్న ప్రజా సంకల్ప యాత్ర ఒక సంచలనంగా మరపురాని చరిత్రను సృష్టించిందని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  ప్రజా సంకల్ప మహా పాదయాత్ర చేపట్టి నేటికి 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోమవారం నందికొట్కూరు పట్టణం అల్లూరు రోడ్డు, పాత బస్టాండ్ సెంటర్ లోని  దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ  మళ్లీ రాజన్న రాజ్యాన్ని తేవాలన్న సంకల్పంతో వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమాధి వద్ద 2017 నవంబర్‌ 6న జగనన్న పాదయాత్రకు తొలి అడుగు వేశారన్నారు. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అనే నేను.. అని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు నాంది పలికిన రోజు ఇది అన్నారు. ప్రజల వద్దకు వెళ్లి స్వయంగా వారి కష్టాలు తెలుసుకున్నారని,  ‘నేను ఉన్నాను.. నేను విన్నాను’ అని వారి కన్నీళ్లను తుడిచారని తెలిపారు. ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక బిడ్డగా, ఒక మనవడిగా ప్రతి కుటుంబంలో ఒక సభ్యునిగా అండగా ఉంటానని హామీ ఇచ్చి..  ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని హామీలను మేనిఫెస్టోలో చేర్చి..  ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత.. మ్యానిఫెస్టోనే భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావించి..  98 శాతం హామీలను అమలు చేసి దేశానికే ఆదర్శప్రాయంగా జగనన్న నిలిచారని ఆమె స్పష్టం చేశారు. కుల, మత, ప్రాంత, వర్గ, పార్టీలకు అతీతంగా అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, మహిళా సాధికారత, విద్యా దీవెన, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం, నాడు – నేడు కార్యక్రమాల ద్వారా అనేక విప్తవాత్మక మార్పులను తీసుకొచ్చారన్నారు. మంత్రివర్గ కూర్పులో సామాజిక న్యాయం పాటిస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ- వర్గాలకు 50 శాతానికి పైగా మంత్రి పదవులను కేటాయించారని తెలిపారు. అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు, మైనారిటీలకు 5 ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి చరిత్ర సృష్టించారని తెలిపారు. ప్రపంచవాప్తంగా కరోనా మహమ్మారి గడగడలాడించినా .. రాష్ట్రంలో సంక్షేమం ఎక్కడా ఆపలేదన్నారు. సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థతో గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మన కళ్లెదుట చూపించిన విజనరీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్  గంగిరెడ్డి రమాదేవి , రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్  హాజీ అబ్దుల్ శుకూర్ , మున్సిపల్ కౌన్సిలర్లు ఉండవల్లి ధర్మారెడ్డి ,  మొల్ల జాకీర్ హుస్సేన్ , వైఎస్ఆర్సిపి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ వనజ , జిల్లా కార్యవర్గ సభ్యులు  షేక్. ఇనాయతుల్లా ,మాజీ సింగిల్ విండో ఛైర్మన్ శ్రీ చందమాల బాలస్వామి , వైసీపీ నాయకులు శ్రీ పేరుమాళ  జాన్ , తమడపల్లి విక్టర్, తాటిపాటి అయ్యన్న, శాతనకోట వెంకటేశ్వర్లు, భాస్కర్, వలి, శంకరయ్య, ముజీబ్, శ్రీనాథ రెడ్డి, వెంకటస్వామి, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author