PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

100 మందికి విశిష్ట మహిళా పురస్కారల ప్రదానోత్సవం..

1 min read

పెద్ద ఎత్తున పాల్గొన్న సంఘ సభ్యులు..

ప్రపంచ స్థాయిలో ఇన్నర్ వీల్స్ సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయం..

నగర మేయర్ షేక్  నూర్జహాన్..

మహిళలు  దేన్నైనా సాధించవచ్చు అనటానికి మి ఐక్యతే  నిదర్శనం..

జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : మార్గరెట్ ఆలివ్ గోల్డింగ్ అనే నర్స్ స్థాపించిన “ఇన్నర్ వీల్ క్లబ్”స్నేహం,సేవ ధ్యేయంగా మహిళలచే నిర్వహించే బడుతూ, అంతర్జాతీయ సేవా సంస్థ గా విరాజల్లుతూ 100 వ సంవత్సరం లోకి అడుగు పెట్టిన సందర్భంగా మన ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ ఏలూరు వారు శత వసంతాల వేడుకలో వం దమంది  సేవా మూర్తులైన మహిళలకు” విశిష్ట మహిళా పురస్కార ప్రదానోత్సవం చేసి,ఘనంగా సత్కరించడం జరిగింది.ఈ సత్కారం లో ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో ఇన్నర్ వీల్స్  ఇంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ మహిళలు తలుచుకుంటే ఐక్యతతో దేన్నైనా సాధించవచ్చు అనటానికి ఇదే నిదర్శనం అన్నారు. డాక్టర్లు, లాయర్లు, లెక్చరర్లు, టీచర్లు, ఉద్యోగ, వ్యాపార వివిధ రంగాల సంస్థల అధ్యక్షులైన మహిళలు, మున్సిపల్ ఉద్యోగులు మొదలైన 100మంది మహిళలను ఘనంగా సత్కరించడం జరిగింది.అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఈ సత్కార సహిత శతవసంతాల వేడుకలో -ఏలూరు క్లబ్ మెంబర్ మరియు ఇంటర్నేషనల్ ఇన్నర్ వీల్ ట్రెజరర్ అయిన సరితా లునాని, క్లబ్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్ జి.శ్రీదేవి,పాస్ట్ డిస్ట్రిక్ట్ చైర్మన్ లు, ప్రాజెక్టు కన్వీనర్ డా.పి.సుబ్బలక్ష్మి, క్లబ్ ప్రెసిడెంట్ పి.ఎస్.లక్ష్మి,సెక్రెటరీ జి.అచ్యుత,క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ లు, డిస్ట్రిక్ట్ మెంబర్లు,క్లబ్ మెంబర్లు పాల్గొన్నారు. అనంతరం క్లబ్ కు చైర్మన్ అఫిషియల్ విజిట్ జరగింది, ఈ సందర్భంగా కొన్ని సర్వీస్ ప్రాజెక్ట్స్ చేశారు.బ్రాండింగ్ ఇన్నర్ వీల్ లో భాగంగా”ఇన్నర్ వీల్ పోల్”శాతవాహన నగర్ లో ఏర్పాటు చేయడం.విద్యార్ధినులకు సైకిళ్ళు పంపిణీ.స్మార్త వేదపాఠశాలలో విద్యార్థులకోసం ఫ్యాన్లు దించుట.స్కూల్ కి గేమ్స్ ఐటమ్స్  ఇవ్వడం జరిగిందని క్లబ్ ప్రెసిడెంట్, సెక్రెటరీ తెలిపారు.

About Author