PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెద్దివీటి రమణయ్యకు ఘననివాళి

1 min read

పల్లెవెలుగు, అన్నమయ్య జిల్లా బ్యూరో:అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి మున్సిపాలిటీ లోని  పూలతోట హరిజనవాడకు చెందిన 2 వార్డ్ మాజీ కౌన్సిలర్ పెద్దివీటి రమణయ్య అనారోగ్యం తో మరణించిన విషయం తెలిసి రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుడు సుగవాసి ప్రసాద్ బాబు గారువెళ్లి రమణయ్య భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అనంతరం  వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో అబ్బవరం రఘు(మాజీ ఎంపీటీసీ ),బండకింద మనోహర్,అశోక్,ఫారెస్ట్ రవి,వండాడి రెడ్డెయ్య,సుబ్బరాయుడు,ఫీల్డ్ అసిస్టెంట్ రమణ,ముత్తుకూరు రఫీ,కోటి,మన్నేరు రామాంజనేయులు,తదితరులు పాల్గొన్నారు.

About Author