పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి: డీఈఓ
1 min read– అన్నమయ్య జిల్లా డీఈవో శ్రీరాం పురుషోత్తం
పల్లెవెలుగు, అన్నమయ్య జిల్లా బ్యూరో: పదవ తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు బోధన చేయాలని డిఈఓ శ్రీరామ్ పురుషోత్తం కోరారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక డైట్ విద్యా కేంద్రాన్ని తనిఖీ చేశారు. తరగతి గదులలో ఉపాధ్యాయుల బోధనా విధానాన్ని పరిశీలించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. సిలబస్ ఎంతవరకు పూర్తయింది విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పదవ తరగతి విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ బంగారు భవిష్యత్తుకు పదవ తరగతి మొదటి మెట్టు అన్నారు. సమయాన్ని వృధా చేసుకోకుండా క్రమశిక్షణతో, పట్టుదలతో బాగా చదవాలన్నారు. మంచి ఫలితాలు సాధించి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అనంతరం డైట్ కేంద్రం నందు జరుగుతున్న లిప్ శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ , అన్నమయ్య జిల్లా అధ్యక్షులు కొండూరు శ్రీనివాసరాజు, ప్రధానోపాధ్యాయురాలు నిర్మల, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.