PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిబంధనల మేరకే బాణసంచా స్టాల్స్‌కు అనుమతి

1 min read

– ప్రభుత్వ నిబంధనలు తప్పక పాటించాలి

– ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్

పల్లెవెలుగు వెబ్ ఆదోని :    దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా స్టాల్స్‌ ప్రభుత్వం నిబంధనలు తప్పక పాటించాలని ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ బాణసంచా దుకాణ యాజమాన్యానికి మరియు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో ఆదోని డివిజన్ లోని బాణసంచా యాజమాన్యానికి మరియు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ….ప్రతి స్టాల్‌ దగ్గర 100 లీటర్ల సామర్థ్యమున్న  డ్రమ్ముల్లో నీటిని ఏర్పాటు చేయించాలని,  ఒక్కో దుకాణం దగ్గర  ఇసుక నింపిన బకెట్లు ఉంచాలని,  దుకాణానికి దుకాణానికి మధ్య కనీసం మూడు మీటర్ల దూరం ఉండే విధంగా చూసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.. అదే విధంగా షాప్స్ కూడా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ అయిన రేకుల షెడ్ తో నిర్మించే విధంగా చర్యలు చేపట్టాలని, చిన్న పిల్లలకు బాణసంచా విక్రయించకుండా చూసుకోవాలన్నారు. ఐఎస్ఐ స్టాండర్డ్ తో ఉన్న బాణాసంచా మాత్రమే అమ్మే విధంగా చూసుకోవాలని సంబంధిత అధికారులను సబ్ కలెక్టర్ ఆదేశించారు.  స్టాల్స్‌ వద్ద అగ్నిమాపక వాహనాన్ని, అంబులెన్స్ వాహనాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మరీ ముఖ్యంగా శాంతియుత సమస్యలు తలెత్తకుండా  చర్యలు తీసుకోవాలని  సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేసి దీపావళి పండుగ సజావుగా నిర్వహించే విధంగా చూసుకోవాలన్నారు. బాణసంచ విక్రయించుటకు నవంబర్ 11 తేదీ నుండి నవంబర్ 14 తేదీ వరకు విక్రయించుటకు అనుమతి ఉంటుందన్నారు. నవంబర్ 15వ తేదీ మధ్యాహ్నం లోపల స్టాల్స్ తీసివేయాలని బాణసంచ యాజమాన్యానికి సబ్ కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వెంకటలక్ష్మి, టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ నాయక్, అగ్నిమాపక అధికారి జి. రామాంజనేయులు, మున్సిపల్ సిటీ ప్లానర్ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

సబ్​ కలెక్టర్​, 100 లీటర్లు, తాసిల్దార్​,

About Author