ఎమ్మెల్యే కోటారు ప్రజా సమస్యలపై దృష్టి .. పల్లెనిద్ర..
1 min readపల్లెవెలుగు వెబ్ ఏలూరు : పల్లెల్లో ప్రజల సమస్యలను ప్రత్యక్షం గా తెలుకునేందుకు దెందులూరు ఎం ఎల్ ఏ కొటారు అబ్బయ్య చౌదరి పెదవేగి మండలంవేగివాడ గ్రామం లో సోమవారం సాయంత్రం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించసారు. దెందులూరు మండలం వేగవరం దగ్గర సాయంత్రం ఏలూరు లోని నారాయణ జూనియర్ కాలేజి బస్ బోల్తా పడిందని సమాచారం తెలుసుకున్న ఎం ఎల్ ఏ అబ్బయ్య చౌదరి పాదయాత్ర మధ్యలో ఆపేసి తన అనుచరులతో కలిసి ప్రమాదానికి గురైన ప్రాంతానికి చేరుకుని విద్యార్థుల ను తీసుకుని ఆసుపత్రికి వెళ్లారు.అక్కడ నుండి నేరుగా వేగివాడ చేరుకుని స్థానిక వై సి పి నాయకుల తో వేగివాడ గ్రామాబి వృద్ధి పై చర్చించారు.సోమవారం రాత్రి నుండి మంగళ వారం ఉదయం వరకు పల్లె నిద్ర చేశారు. మంగళ వారం వేకువ జామున నిద్ర లేచి గ్రామం లో ప్రతి వీది. ప్రతి గడప కు వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ప్రజలనడీగి తెలుసు కున్నారు.ఎం ఎల్ ఏ పాదయాత్రలో ప్రజలు గారామం లో పైపులైన్ల వ్యవస్థ బాగాలేదని.విద్యుత్ దీపాలు వెలగడం లేదని ఎం ఎల్ ఏ దృష్టికి తెచ్చారు.నేటికీ ఇంకా గ్రామల లో ఎం ఎల్ ఏ పాదయాత్ర కొనసాగుతూనే ఉంది.