దళిత కుటుంబాల అభివృద్ధి..జగనన్న తోనే సాధ్యం
1 min read-మంత్రి మేరుగ నాగార్జునకు ఘన స్వాగతం పలికిన యాట ఓబులేష్
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: ప్రతి దళిత కుటుంబాల్లో అభివృద్ధి చేయాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికే సాధ్యమని వైఎస్ఆర్సిపి రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని నాగలూటి గ్రామానికి చెందిన యాట ఓబులేష్ అన్నారు.మంగళవారం ఉదయం 7:30 రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు మేరుగ నాగార్జున శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు.పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీ కొరకు కష్టపడే వారికి పార్టీలో సముచిత స్థానం కల్పించాలని మంత్రుని యాట ఓబులేష్ కోరారు.ఈ సందర్భంగా యాట ఓబులేష్ శ్రీశైలంలో ప్రభుత్వ అతిథి గృహంలో ఉదయం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి మంత్రికి పూల బోకే అందజేస్తూ శాలువాతో ఘనంగా సత్కరిస్తూ ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా యాట ఓబులేష్ మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి పనులు మన రాష్ట్రంలో సీఎం జగనన్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఉన్నారని చెప్పిన హామీల కన్నా ఎక్కువగానే పథకాలు ప్రజల వద్దకు చేర్చార ని అన్నారు.వచ్చే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా అయితే ప్రతి పేద కుటుంబంలో అభివృద్ధి వెలగులు ఇంకా మెండుగా ఉంటాయని ఆయన అన్నారు.విద్యాపరంగా పేద విద్యార్థులు ముందంజలో అభివృద్ధి బాటలో ఉంటారని అన్నారు.సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.