PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజల అభిమానం జన్మలో మరవను..!

1 min read

– గడపగడప కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి దగ్గరయ్యాను.

– 90,050 గడపలు సందర్శించడం సంతృప్తినిచ్చింది.

– నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్.

–పల్లెకుపోదాం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు.

– గడపగడప కార్యక్రమం పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసిన వైసీపీ అభిమానులు.

– ఎమ్మెల్యే ను ఘనంగా సన్మానించిన వైసీపీ నాయకులు.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  రాష్ట్ర ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడప మన ప్రభుత్వ కార్యక్ర మంలో నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు తనపై చూపిన అభిమానం ,ఆత్మీయత జన్మలో మరచ పోనని వారికి సేవ చేయడం సంతృప్తి ఇచ్చిందని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ అన్నారు. గడపగడప కార్యక్రమం నియోజకవర్గంలోని 86 సచివాలయాలలో పూర్తి చేసుకున్న సందర్భంగా  బుధవారం నందికొట్కూరు పట్టణంలో ఎమ్మెల్యే కార్యాలయంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే ను ఘనంగా సన్మానించారు. భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ఆరు మండలాల వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్థర్ విలేకరులతో మాట్లాడుతూ గడపగడప కార్యక్రమం ద్వారా 86 సచివాలయాల పరిధిలో 162 రోజులలో 152 గ్రామాలలోని 90,050 ఇళ్లను ప్రత్యక్షంగా సందర్శించడం జరిగిందన్నారు.ప్రజల సమస్యలను నేరుగా తెలుకొనే అవకాశం కలిగిందన్నారు .కార్యక్రమానికి సహకరించిన అధికారులు, వాలంటరీలు, సచివాలయం సిబ్బంది ,నాయకుల కృషి మరవలేమన్నారు .ప్రజా సంకల్ప పాదయాత్ర నాలుగు ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా  పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ నియోజకవర్గంలో 190 కి.మీ చేపట్టిన పాదయాత్ర కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు.9 వ తేదీ నుంచి ప్రభుత్వం చేపట్టిన పల్లెకు పోదాం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నవరత్నాల లో భాగంగా సంక్షేమ పథకాలు ద్వారా నందికొట్కూరు నియోజకవర్గానికి దాదాపు రూ.3 వేల కోట్లు పంపిణీ చేయడం జరిగిందని ఇది వైసీపీ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైందని అన్నారు.నందికొట్కూరు అభివృద్ధి పై తెలుగుదేశం పార్టీ నాయకులు బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.అభివృద్ధి అంకెల గారడి కాదని ప్రతి గ్రామానికి ఎంత వచ్చిందో లెక్కలతో సహా చూపిస్తామని పేర్కొన్నారు.టీడీపీ నాయకులు దుష్ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్  హాజీ అబ్దుల్ షుకూర్ , రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్  రామ సుబ్బయ్య , రాష్ట్ర రైతు విబాగం ఉపాధ్యక్షులు  వంగాల. శిద్దారెడ్డి ,  మున్సిపల్ వైస్ చైర్మన్  మొల్ల రబ్బాని , మండల నాయకులు ఉండవల్లి ధర్మారెడ్డి, కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ వనజ , జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు  సగినేల. వెంకట రమణ ,జిల్లా  ఎస్సీ ఎస్టీ  విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు  దిలీప్ రాజ్ , జిల్లా కార్యవర్గ సభ్యులు  ఇనాయతుల్లా ,  నాగార్జున ప్రసాద్ , కొత్తపల్లి మండల నాయకులు దుద్యాల.రఫీ , జుపాడుబంగ్లా మండల నాయకులు జంగాల. పెద్దన్న , పగిడ్యాల మండల నాయకులు  చిట్టి రెడ్డి వైసీపీ నాయకులు తమ్మడపల్లి విక్టర్, పెరుమాళ్ళ జాన్ , అయ్యన్న, శాతనకోట వెంకటేశ్వర్లు. మల్యాల శంకరయ్య, మాజీ సింగిల్ విండో చైర్మన్ బాలస్వామి, దామగట్ల రత్నం , ఏసురత్నం , సంజన్న, వేల్పుల నాగన్న,వివిధ మండలాల   వైఎస్ఆర్సిపి నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author