PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆక్యుపంచర్ తో ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు

1 min read

పల్లెవెలుగు వెబ్  విజయవాడ : ఆక్యుపంచర్ వైద్య విధానంలో ఎలాంటి దుష్ఫలితాలు, హాని ,ఉండవని ముఖ్యఅతిథిగా విచ్చేసిన, ఎన్ టి టి  పి ఎస్ చీఫ్ ఇంజనీర్ ఓ & యన్  పి .నవీన్ గౌతమ్ అన్నారు. ప్రపంచ ఆక్యుపంచర్ దినోత్సవ సందర్భంగా నార్ల తాతారావు తాప విద్యుత్ సర్వీస్ బిల్డింగు నందు విజయవాడ ఆకుపంచర్ సైన్స్ ప్రాక్టీషనర్ అసోసియేషన్ ఆఫ్ భారత్ ఆధ్వర్యంలో మంగళవారం సెమినార్ వైద్య శిబిరం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్యుపంచర్ వైద్య విధానం అతి పురాతమైందన్నారు భారత జాతికి చెందినదని కానీ చైనా నందు పేరు పొందిందని తెలిపారు.దీని చికిత్సకు ఎలాంటి ఖర్చు ఉండదు అన్నారు ఈ విధానంలో కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి జబ్బులు అయినా దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకకోవచ్చు ఆయన అన్నారు. అసోసియేషన్ ఫౌండర్, జనరల్ సెక్రెటరీ, డాక్టర్ ఎం. సత్యనారాయణ మాట్లాడుతూ ఈ వైద్య విధానం వల్ల ఎంతో సంపాదించడం జరిగిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు దీని ప్రభావంతమైన చికిత్సగా పేర్కొని దేనిని ప్రతి సంవత్సరం నవంబర్ 15వ తేదీన వరల్డ్ ఆక్యుపంచర్ ,దినోత్సవం గా ప్రకటించాలని తెలిపారు. ఈ వైద్యం ప్రతి జబ్బుకు మూల చికిత్స వైద్యంగా ఉపయోగపడుతుందని, అన్నారు. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనర్ధాలు ఉండవన్నారు. ఈ వైద్యం ద్వారా ఎన్నో సర్జరీలు తగ్గించినట్లు వివరించారు. ఈ వైద్య విధానం వల్ల ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాలు కాపాడుకున్న వారు అవుతారని చెప్పారు .. ఈ వైద్యం ద్వారా చికిత్స చేయడం అతి తేలిక మనలో నిగూఢతమై ఉన్న శక్తిని వెలికి తీసి దాని ద్వారా మనలో ఉన్న రుగ్మతలను తొలగించుకుంటే ఈ వైద్య విధానం ప్రత్యేకత మన భారత ప్రభుత్వం దీనిని ప్రత్యేక వైద్య విధానంగా గుర్తించిందని ,గుజరాత్ ప్రభుత్వం ఆక్యుపంచర్ వైద్య కౌన్సిల్ ని కూడా ఏర్పాటు చేసిందని, కరోనా తర్వాత ఈ వైద్య విధానం ప్రపంచ వ్యాప్తంగా పెరిగిందని, ప్రతి ఒక్కరూ ఈ వైద్య విధానం వలన తమ తమ ఆరోగ్యాలు కాపాడుకున్న వారు అవుతారని, చాలా తక్కువ ఖర్చుతోనే వ్యాధులు తగ్గించుకున్న వారు అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షక ఇంజనీర్లు కే.వీ. రాజారావు కృష్ణారావు. సురేష్ బాబు డిప్యూటీ సెక్రెటరీ సుశీల. తదితరులు పాల్గొన్నారు.

About Author