జీ.ఓ.117 రద్దు చేయాలి..ఆపస్ డిమాండ్
1 min readపల్లెవెలుగు వెబ్ ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘo ప్రకాశం జిల్లా కోర్ టీమ్ సమావేశం జిల్లా అధ్యక్షులు కె. మల్లికార్జున రావు అధ్యక్షతన ఒంగోలులోని APUS జిల్లా కార్యాలయం లో జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఒకటవ తేదీన జీతాలు చెల్లించవలసిన పరిస్థితి నుండి 5 తేదీ అయినా జీతాలు రాలేదని ఈ పరిస్థితి నుండి ప్రభుత్వం బయటపడి 1 వ తేదీన జీతాలు చెల్లించాలని కోరారు. ఈ సమావేశములో ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సిహెచ్ . శ్రావణకుమార్ మాట్లాడుతూ జులై 2023 నుండి అమలు కావాల్సిన PRC ఆలస్యమవుతున్నందున వెంటనే ఐ ఆర్ ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న కరువు భత్యం బకాయిలను చెల్లించాలని కోరారు. మరో ముఖ్య అతిధి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ S. బాలాజీ మాట్లాడుతూ 117 జీ. ఓ వలన రాష్టము లోని చాలా జిల్లాల్లో ఉపాధ్యాయ ఖాళీలు లేకుండా పోయాయని, పాత పద్ధతి లోనే ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి ఉండాలని కోరారు. అదే విధంగా ప్రధానోపాధ్యాయుడు మరియు వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులు తొలగించిన ఉన్నత పాఠశాలల్లో తిరిగి ఆ పోస్ట్ లను మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి టి. దిలీప్ చక్రవర్తి, కోశాధికారి బి.వి.యస్. గుణప్రసాద్, కోర్ కమిటీ సభ్యులు వి. చంద్రశేఖర్, కె. నరసింహం తదితరులు పాల్గొన్నారు.