PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గర్భిణీ స్త్రీలకు ఉచిత పోషకాహారం పంపిణీ               

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి పరీక్షల కోసం వచ్చే గర్భిణీ స్త్రీలకు  పోచిమిరెడ్డి సేవాదళ్ సంస్థ గురువారం ఉచిత పోషకాహార పంపిణీ కార్యక్రమం చేపట్టింది.ప్రతి నెల 9వ తేదీ గర్భిణీ స్త్రీలు స్కానింగ్ కొరకు పత్తికొండ హాస్పిటల్ కు వారి సహాయకులతో వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుని వెళుతూ ఉంటారు. వారి సౌకర్యార్థం పోచిమిరెడ్డి సేవాదళ్ సంస్థ గర్భిణీలకు, వారి సహాయకులకు పౌష్టికాహారం, స్వచ్ఛమైన ప్యూరిఫైడ్ వాటర్ ను ఉచితంగా ఏర్పాటు చేశారు. గర్భిణీలు కుటుంబ సభ్యులు, సహాయకులు వైద్య సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కల్పన  ప్రారంభిచి గర్భిణీ స్త్రీలకు స్వయంగా భోజనాలను వడ్డించింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు అనిత సరోజ మాజీ ఎంపిటిసి గణపతి సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.

About Author