PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాక్ పోల్ ప్రక్రియ లో ఈవిఎం ల పనితీరు పరిశీలన

1 min read

– పారదర్శక ఓటింగ్ ప్రక్రియ కొరకే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల మాక్ పోల్

– కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి సృజన

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల మాక్ పోలింగ్ ప్రక్రియ పారదర్శక ఓటింగ్ ప్రక్రియ కొరకే అని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి సృజన పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్  ఈ.వి.యమ్ గోడౌన్ లోని మొదటి అంతస్తులో జరుగుతున్న మాక్ పోల్ కార్యక్రమాన్ని  రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ డాక్టర్ జి. సృజన పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎఫ్ఎల్సి ప్రక్రియ నిన్నటితో ముగిసిందని పేర్కొన్నారు.  గురువారం , శుక్రవారం  మాక్ పోల్ ప్రక్రియ లో  ఈవిఎం ల పనితీరు పరిశీలన ఉంటుందని, ఇందులో పోల్ చేసిన ఓట్లు సరిగా నమోదు అవుతున్నాయా లేదా అని తదితర వివరాలను పరిశీలించడం జరుగుతుందని అన్నారు.సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ పకడ్బందీగా ఉండాలని, ఈవిఎం మాక్ పోల్ ప్రక్రియ జరిగే గోడౌన్ లోకి ఎలాంటి సెల్ ఫోన్లు, కెమెరా లు అనుమతి లేదని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఈవీఎం ల FLC(ఫస్ట్ లెవెల్ చెకప్) నోడల్ అధికారి మరియు జిల్లా పంచాయతీ అధికారి నాగరాజ నాయుడు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ మురళి తదితరులు పాల్గొన్నారు.

About Author