ప్రభుత్వం ..నిర్ణయం చారిత్రాత్మకం..
1 min readఅందుకు పలు జాగ్రత్తలు, సూచనలు తీసుకోవాలి..
షేక్ సయ్యద్ బాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమగ్ర కుల గణన చేపట్టాలకొన్న నిర్ణయం చారిత్రాత్మకం. అని నూరు బాషా దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ సయ్యద్ బాజీ (గాజుల బాజీ) గురువారం కలెక్టరేట్ మీడియా పాయింట్ లో విలేకరులతో మాట్లాడారు. 1931 వ సంవత్సరంలో జరిగిన కులగనన మళ్లీ 92 సంవత్సరాల తర్వాత నేడు ఆంధ్రప్రదేశ్లో నవంబర్20, 2023 నుండి ప్రారంభం కానందుని, రాష్ట్రంలో నూరు భాష / దూదేకుల ముస్లిం సామాజిక వర్గం రిజర్వేషన్ల పరంగా బీ.సీ -బి లోను సీరియల్ నెంబర్ 5గా నమోదు కాబడి ఉన్నది. మతపరంగా ముస్లింలు అయినందు వలన మమ్ములను ముస్లిం మైనార్టీలుగా కూడా పరిగణిస్తారు. నూరు భాషా/ దూదేకుల సామాజిక వర్గంలో ఇంటి పేర్లు రాయలసీమలో ఒక రకంగానూ కోస్తా తీర్ ప్రాంతంలో ఒకరకంగానూ ఉంటాయి. ఉదాహరణకి కోస్తాతీర ప్రాంతంలో ఇంటిపేరు షేక్ అని ఉంటుంది. అలాగే షేక్ అనే ఇంటి పేరు బి.సి -ఈ లోని ఉర్దూ ముస్లిం సోదరులు కూడా కలిగి ఉంటారు. కావున బి.సి-బి నూరు భాషా ముస్లింలకు బీ.సీ-ఈ ఉర్దూ ముస్లిం సోదరులకు కూడా షేక్ అనే ఇంటి పేరు ఉండటం వలన కులాల వారి జనాభా సేకరణలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతేకాక ఇంటిపేరును బట్టి ముస్లిములుగా పరిగణించి అందరినీ బీ.సీ-ఈ ఉర్దూ ముస్లింలలో చూపించిన ఎడల నూరు భాషా దూదేకుల ముస్లింలు తీవ్రంగా నష్టపోతున్నారు. అంతేకాక కులాల వారి జనాభా సేకరణ చేపట్టిన ఉద్దేశం నెరవేరదు. కావున ఈ విషయంలో ఇంటిపేరును బట్టి మతాన్ని బట్టి వారిని బి.సి-బి దూదేకులుగాను లేక బీ.సీ-ఈ ఉర్దూ ముస్లింలు గాను నమోదు చేయకుండా స్పష్టమైన సమాచారం సేకరించి పౌరుల అనుమతితో వారి కులము నమోదు చేయాలని. అందుకు తగిన విధంగా అన్ని జిల్లాల కలెక్టర్ల ద్వారా సచివాలయాలకు సెక్రెటరీలకు, వాలంటీర్లకు ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అందుకు అనుగుణంగా వారికి శిక్షణ ఇవ్వాలన్నరు. కేవలం ఇంటిపేరు షేక్ అయినంత మాత్రాన వారిని బీ.సీ-ఈ ఉర్దూ ముస్లింలుగా పరిగణించకూడదు అని ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అంతేకాక రాయలసీమలో కొందరు కులం పేరుని ఇంటిపేరుగా కొనసాగిస్తారు. ఉదాహరణకి దూదేకుల సిద్దయ్య ,పింజారి హుస్సేన్, ఇలా కులం పేరుని ఇంటిపేరుగా వ్యవహరిస్తారు. మరి కొంతమంది హిందువుల పేర్లను కూడా దూదేకుల నూరు భాషాలు వినిగేస్తారు. కాబట్టి అన్ని విషయాలను పరిశీలించి స్పష్టమైన విచారణ చేపట్టి పౌరుల యొక్క అనుమతితో వారి యొక్క కులాన్ని నమోదు చేయాలని కోరుతున్నామన్నరు. అంతేకాక ఇంటి పేరును బట్టి మతాన్ని బట్టి మనిషి పేరుని బట్టి లెక్క చేయ్యోద్దని షేక్ సయ్యద్ బాజీ (గాజుల బాజీ) ఏలూరు వైస్ ప్రెసిడెంట్ షేక్ భాషా వలి కోరారు. అనంతరం యం అర్ ఓ సోమశంకర్ కు వినతి పత్రం అందించారు.