ఉచిత ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన పోచిమి రెడ్డి సేవాదళ్ సంస్థ
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ పట్టణంలో పోచిమి రెడ్డి సేవాదళ్ సంస్థ గత కొంతకాలంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నది. అందులో భాగంగా పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీరు ఉచితంగా అందించాలనే ఉదార భావంతో పోచిమిరెడ్డి సేవాదళ్ సంస్థ పట్టణంలో 15, 16, 17 వార్డులకు వైయస్సార్ ఉచిత ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఇప్పటికే పట్టణంలో మూడు ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ల ద్వారా ఉచితంగా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. సేవాదళ్ సంస్థ వ్యవస్థాపకులు మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం టీచర్స్ కాలనీలో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. అనంతరం కాలనీవాసులు, రిటైర్డ్ ఎంఈఓ సుశీలమ్మ, శంకరయ్య, శ్రీ పోచిమి రెడ్డి మురళీధర్ రెడ్డి తో కలిసి ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. అనంతరం సభను ఉద్దేశించి సభికులు శ్రీ పోచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. అనంతరం సేవాదళ్ నందు సభ్యత్వం తీసుకున్న సభ్యులకు బాణాసంచా పంచారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఈఓ శ్రీమతి సుశీలమ్మ చక్రాల లక్ష్మీకాంత్ రెడ్డి పులికొండ రామానాయుడు,కాలనీవాసులు పాల్గొని మురళీధర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.