పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించాలి
1 min read– దీపావళి వేడుకలను పర్యావరణహితంగా జరుపుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి .
– దీపావళి సందర్భంగా హరిత బాలసంచాను పంపిణీ చేసినసీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ వెల్లడి .
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రానున్న కాలంలో భవిష్యత్తు తరాల మనుగడ ప్రశాంతంగా ఉండాలంటే పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించాలని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ బి. శంకర్ శర్మ అన్నారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయం ఆవరణలోని మీడియా సెంటర్ వద్ద జర్నలిస్టులకు సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ హరిత బాణాసంచా( గ్రీన్ క్రాకర్స్) పంపిణీ చేశారు .ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ మాట్లాడుతూ దీపావళి సందర్భంగా రసాయనాలతో కూడిన సాధారణ బానసంచాను ప్రతి ఒక్కరు వినియోగిస్తున్నారని, దీనివల్ల పర్యావరణ పరిరక్షణకు ముప్పుబాటిల్లి భవిష్యత్తు తరాల మనుగడ కష్టమవుతుందని వివరించారు .రసాయనాలతో కూడిన బాణసంచాలో బేరియం, ఆర్సినిక్ ,లెడ్, మెగ్నీషియం జ్సోడియం వంటి విష పదార్థాలు ఉంటాయని, బాణాసంచాను కాల్చినప్పుడు అవి వాతావరణం లో కలిసిపోయి మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లేలా చేస్తాయని చెప్పారు . విష రసాయనాలతో కూడిన బాలసంచా కాల్చడం వల్ల మనసుల్లో మెదడు, గుండె, మూత్రపిండాలు, నాడి మండల సమస్యలు ఉత్పన్నమవుతాయని వివరించారు .అలాగే వాటి శబ్దం అధికంగా ఉండటం వల్ల శబ్ద కాలుష్యం కూడా ఏర్పడుతుందని చెప్పారు. దీపావళితోపాటు సమాజంలో ఏ శుభకార్యం జరిగిన బాణాసంచా కాల్చడం పరిపాటిగా మారిందని, దీనివల్ల విష రసాయనాలు విస్తృతంగా వాతావరణంలో కలిసిపోయి పర్యావరణ కాలుష్యానికి కారణం అవుతున్నాయని చెప్పారు. ఇలాంటి రసాయనాలతో కూడిన బాణసంచా కాల్చడాన్ని నిషేధించారని ,వీటికి ప్రత్యామ్నాయంగా హరిత బాణాసంచాను కాల్చడానికి సూచించారని చెప్పారు. సి ఎస్ ఐ ఆర్ తోపాటు జాతీయ పర్యావరణ మండలి సిఫారసు చేసిన హరిత బాణ సంచాను మాత్రమే కాల్చాలని ఆయన వివరించారు. దీనివల్ల వాతావరణ కాలుష్యం ఉండదని ,మనిషికి ఆరోగ్య సమస్యలు కూడా ఉత్పన్నం కావని ఆయన తెలియజేశారు. దీపావళి పర్వదినం అందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని అలా కాకుండా రసాయనాలతో కూడిన బాణసంచా కాల్చడం వల్ల పర్యావరణాన్ని కాలుష్యం చేయడంతో పాటు ఆరోగ్య సమస్యలను ఉత్పన్న ప్రజల జీవితాలు దుర్భరం కాకూడదని సీనియర్ గాష్టం ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు.