మౌలానా అబుల్ కలాం ఆజాద్ కు ఘనంగా నివాళులు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: జాతీయ విద్యా విధానాన్ని ప్రోత్సహించిన మొదటి విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్- అసోసియేషన్ ఆఫ్ అలియన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ కమిటీ చైర్ పర్సన్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్.విద్యావేత్త ,రాజనీతిజ్ఞుడు, స్వాతంత్ర సమరయోధుడు, భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం జయంతిని పురస్కరించుకొని నేడు లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ఆధ్వర్యంలో స్థానిక కే.ఎన్.ఆర్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు కే.ఎన్.ఆర్ పాఠశాల ఉపాధ్యాయులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలను అలంకరించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లయన్స్ జిల్లా అడిషనల్ క్యాబినెట్ సెక్రటరీ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ హిందూ ముస్లింల ఐక్యత కోసం పోరాటం చేసి, పేదరికం లేని భారతదేశము కావాలని తపించిన రాజకీయ ప్రముఖులలో అబ్దుల్ కలాం ఆజాద్ ఒకరని ఆయన ఆశయ సాధన దిశగా నేటి తరం యువత నడుచుకోవాలన్నారు. కార్యక్రమంలో కే.ఎన్.ఆర్ పాఠశాల కరస్పాండెంట్ లయన్ గోపీనాథ్, లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ అధ్యక్షురాలు లయన్ రాయపాటి నాగలక్ష్మి, ఉపాధ్యాయులు షరీఫ్ ,కల్పనా ,అశ్వక్, రఫీక్, మాధవి తదితరులు పాల్గొన్నారు.