PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డా.మౌలానా అబుల్ కలాం సేవలు స్ఫూర్తిదాయకం

1 min read

పాఠశాలలలో డిజిటల్ విద్యాబోధన కొరకు ఎంపీ నిధుల నుండి డిజిటల్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేపిస్తాం

కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : డా.మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత దేశానికి అందించిన సేవలు స్ఫూర్తిదాయకం అని పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ పేర్కొన్నారు.శనివారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం మైనారిటీల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో భారత రత్న జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా మైనారిటీ సంక్షేమ దినోత్సవం మరియు జాతీయ విద్యాదినోత్సవ వేడుకలలో పాల్గొన్న కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్, నగర మేయర్ బివై.రామయ్య, డిఆర్ఓ కే మధుసూదన్ రావు, మైనార్టీ సంక్షేమ అధికారి సభిహా పర్వీన్, మైనార్టీ సంక్షేమ నాయకులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ డా.మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత దేశానికి అందించిన  సేవలు స్ఫూర్తిదాయకం అని అన్నారు. నేటి విద్యార్థులు అధునాతన పద్ధతిలో విద్యను అభ్యసించేలా పాఠశాలలలో డిజిటల్ విద్యా బోధన ఎంతో అవసరమని, అందుకు ఐదు నెలల లోపు పాఠశాలలలోని డిజిటల్ విద్యాబోధనకు అవసరమైన డిజిటల్ ఎక్విప్మెంట్ను ఎంపీ నిధుల నుండి ఏర్పాటు చేస్తానన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు విద్యార్థులు చదువుకునేందుకు అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంది మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు మన రాష్ట్రంలో ఒక్కొక్క విద్యార్థికి సంవత్సరానికి దాదాపు 90 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్నారు, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ మక్కాలో జన్మించి, ఈ దేశం పట్ల ఉన్న అమితమైన ప్రేమ అనురాగంతో, ఈ దేశానికి వచ్చి, ఇక్కడ ఉండి ఈ దేశంలో పరాయి పరిపాలన ఉన్నప్పుడు స్వాతంత్ర్యం తెచ్చుకోవడానికి స్వాతంత్ర పోరాటంలో ఆయన జీవితాన్ని మొత్తాన్ని అర్పించిన మహనీయులు, దేశభక్తులు డాక్టర్ మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ అన్నారు. ఒక వ్యక్తి గురించి మనం సంస్మరణ చేసుకునేటప్పుడు వారి జీవితంలో ఏ సిద్ధాంతాల కోసం వారి జీవితాన్ని జీవితమంతా వెచ్చించారో అలాంటి మహనీయుల గురించి ఒకసారి గుర్తు తెచ్చుకొని వారి ఆశయాలను అమలు చేయాలన్నారు. అబుల్‌ కలాం ఆజాద్‌ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రవేశపెట్టిన సంస్కరణలు నేటికీ అమలవుతున్నాయంటే ఆయన గొప్పతనం అర్థం చేసుకోవచ్చన్నారు. స్వాతంత్రం వచ్చినప్పుడు మనదేశంలో అక్షరాస్యత శాతం 14 ఉండేది ఈనాడు74 శాతానికి చేరిందన్నారు. ఆనాటి సమయంలో అట్టడుగున వున్న వర్గాల వారందరూ ఉన్నతమైన చదువులు చదువుకోవడం కోసం యూజీసీ వారి ఆధ్వర్యంలో ఏర్పడింది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమం పట్ల కృషి చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అవకాశలు ఇస్తున్నప్పుడు మన పిల్లలను ఉన్నతమైన చదువులు చదివించి, మహానుభావుడు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ స్థాయికి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. కొంత మంది ముస్లిం సోదరులు వక్ఫ్ బోర్డ్ ఆస్తులను కాపాడాలని ప్రతి పాఠశాలలో మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ఫోటో ని ఏర్పాటు చేసేలా పార్లమెంటులో ప్రస్తావించాలని కోరారని, జరగబోయే పార్లమెంట్ సమావేశంలో సదరు విషయాలను ప్రస్తావిస్తానని ఎంపీ తెలిపారు.నగర మేయర్ బివై.రామయ్య మాట్లాడుతూ విలువైన విద్యకు విశిష్టమైన సేవలను అందించి.. దేశంలో విద్యాభివృద్ధికి బాటలు వేసిన స్వాతంత్య్ర భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ ఆజాద్ అన్నారు. స్వాతంత్ర్యం కోసం పది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారన్నారు. ఆరోజు ఆయన కన్న కలలు ఈరోజు నెరవేరుతున్నాయి మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి మైనార్టీల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని, ముస్లింలకు రాజకీయంగా ఆర్థికంగా ఆదుకున్న ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి అని అన్నారు. రాష్ట్రంలో పౌరులకు గొప్ప ఆస్తి ఇవ్వగలమంటే అది విద్యేనని గుర్తించి విద్యకు ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన పాఠ్యపుస్తకాలు, షులు, బ్యాగులు ఇలా ఎన్నెన్నో ఇస్తూ, అమ్మ ఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, పథకాలను ప్రవేశపెట్టి విద్యార్థులు బాగా చదువుకునేలా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు, అంతేకాకుండా విద్యార్థుల కొరకు పౌష్టికరమైన ఆహారం రాగిజావను కూడా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్నారు. పేదవారు అన్ని విధాల ఎదగాలని ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.మైనార్టీ సంక్షేమ అధికారి సభిహా పర్వీన్, మాట్లాడుతూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం మైనారిటీల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో భారత రత్న జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్  జయంతి సందర్భంగా మైనారిటీ సంక్షేమ దినోత్సవం మరియు జాతీయ విద్యాదినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని వీటన్నిటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముస్లిం మైనార్టీలకు పాఠశాలలు, హాస్టల్స్, ఏర్పాటు చేసింది కాబట్టి విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు వెళ్లాలని అన్నారు.అనంతరం వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంస పత్రాలను పార్లమెంట్ సభ్యుల చేత అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీ సెకండ్ బెటాలియన్ డి.ఎస్.పి శ్రీ మహబూబ్ బాషా, ప్రధానమంత్రి 15 సూత్రాల పథకం ఎన్జీవో మెంబర్లు శ్రీ సయ్యద్ మహమ్మద్ పీర్, యాకోబ్ భాష, పాస్టర్ రవిబాబు  ఆల్మేవ జిల్లా ప్రెసిడెంట్ శ్రీ రియాజ్ భాషా, ఏపీ ఆల్ మెవ ప్రెసిడెంట్ అబ్దుల్ హమీద్, కార్పొరేటర్లు శ్వేతా రెడ్డి , సుదర్శన్ రెడ్డి, ఎంఎస్ఎమ్ఈ డైరెక్టర్ శారదా కాశిరెడ్డి ,మత పెద్దలు, అబ్దుల్లా హఫీజ్, క్రిస్టియన్ మైనారిటీ పెద్దలు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

About Author