సినీ ఆర్టిస్ట్ చంద్రమోహన్ తో అనుబంధం మరువలేనిది
1 min readమాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సినీ ఆర్టిస్ట్ చంద్రమోహన్ మృతి తీవ్ర దిగ్వాంతికి గురి చేసిందని, ఆయనతో ఉన్నటువంటి అనుబంధం మర్చిపోలేనిదని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈరోజు సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రమోహన్ మృతికి దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపాన్ని తెలియజేశారు. అనంతరం ఆయన సినీ నటుడు చంద్రమోహన్ తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాను చదువుకుంటున్న రోజులలో విద్యార్థి నాయకుడిగా ఆదోనిలో ఆడిటోరియం నిర్మాణానికి పునుకున్నామని, టీజీ వెంకటేష్ తెలిపారు. ఆడిటోరియం నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూర్చుకునేందుకు చేసేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని, ఈ కార్యక్రమానికి చంద్రమోహన్ గారు తన టీమ్ అంతా తీసుకుని ఆదోని కి వచ్చారని టీజీ వెంకటేష్ తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా చంద్రమోహన్ కు, ఆయన సభ్యులకు పారితోషకం ఇవ్వబోతే ఆయన సున్నితంగా వద్దని చెప్తూ, విద్యార్థులు మీరు మంచి కార్యక్రమానికి పూనుకున్నారు.. నేను పారితోషకం తీసుకోకపోవడమే మీకు చేస్తున్న ఆర్థిక సహాయం అని చెప్పి,తన గొప్ప మనసును చాటుకున్నారని టీజీ వెంకటేష్ తెలిపారు. సినీ పరిశ్రమలో ఎంతో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి చంద్రమోహన్ అని 175 సినిమాలు హీరోగా చేసి, తొమ్మిది వందల యాభై కి పైగా సినిమాలలో క్యారెక్టర్ నటుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి చంద్రమోహన్ అని టీజీ వెంకటేష్ కొనియాడారు. తాను అరుదుగా కలుస్తున్నప్పటికీ తననే పరిశీలనగా చూసే వారిని ఎందుకు అలా గమనిస్తున్నారు అని అడిగితే, మీరు ఒక పారిశ్రామిక వ్యక్తిగా రాణిస్తున్నారు కదా.. మీ హావ భావాలను గమనిస్తూ రేపు అటువంటి క్యారెక్టర్ చేయవలసి వస్తే ఎలా చేయాలి అన్నది గమనిస్తున్నామని చెప్పే వారిని టీజీ వెంకటేష్ తెలిపారు. సినీ పరిశ్రమలో బాగా స్థిరపడ్డాక డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని తనను సలహాలు అడిగే వారని, ఆయనకు భూముల మీద పెట్టుబడి పెట్టమని సలహా ఇచ్చేవాడిని టీజీ తెలిపారు. అంతటి అనుబంధం ఉన్నటువంటి చంద్రమోహన్ చనిపోవడం తనని ఎంతో బాధిస్తుందని ఆయనక ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు టీజీ వెంకటేష్ తెలిపారు.